783. 🔱🙏 ప్రాణదా 🙏🔱
మూడు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *ప్రాణదాయైనమః* అని చెప్పాలి.
ప్రాణ = ప్రాణములను, దా = ఇచ్చునది.
మందులు ప్రాణాలను ఇవ్వలేవు. పోబోయే ముందు ఎంత విలువైన మందులను ఎన్ని దేహంలోకి ఎక్కించినా ప్రాణశక్తి (Vital body) తిరిగి మన వైపుకే వాటిని త్రిప్పికొడుతుంది (Expels)
ఈ దేహంలో నిరంతరం అశనములు(Organic) - అనశనములు (Inorganic) గాను, అనశనములు అశనములుగాను మారుతూ ఉంటాయి. (సాశనానశనే అభి - పురుష సూక్తం) నిరంతరం జరిగే ఈ మార్పుల వల్ల - దేహం' పెరుగుతుంది కాని, “దేహి' (జీవి) పెరగడు. ఈ జీవి పుట్టినప్పటి నుండి పోయేంతవరకు గూడా పెరుగుదలా
తరుగుదలా లేకుండా ఒక లాగే ఉంటాడు. ప్రాణ, అపానాల మధ్య; అశన, అనశనాల మధ్య జరిగే ద్విగతి స్పందనను ఆంగ్లంలో Double Pulsation అంటారు. 'ప్రాణశక్తి'ని “ప్రాణాగ్ని' అంటారు. ఆయుర్వేదంలో 'పాచకాగ్ని' అంటే పచనం చేసేది(The fire of Metabolism) అనీ, 'రేచకాగ్ని' అంటే బయటకు నెట్టే దీThe fire of excretion) అనే ద్వంద్వ పదాలతో చెబుతారు. అంగముల యందు ' నిహితం' అంటే - 'ఉంచబడినదాన్ని' అగ్ని' అంటారు. గర్భంలో ఉన్న జీవిని మొట్ట మొదటగా మేల్కొల్ఫింప చేసేది ఈ అగ్నియే! ఈ విధంగా మనలో పనిచేసే ప్రాణశక్తి ని ఇచ్చేది అమ్మవారే కాబట్టి, అమ్మవారు “ప్రాణదా'!
ప్రాణాలను ఇచ్చునది - అని ఈ నామానికి అర్థం.
🙏ఓం ఐం హ్రీం శ్రీం ప్రాణదాయైనమః🙏
🌷శ్రీ మాత్రే నమః 🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి