12, నవంబర్ 2023, ఆదివారం

పాకలో బ్రతికినా

 https://whatsapp.com/channel/0029VaA63sq5q08lbf7pP73f

జీవితంలో అప్పు , పగ , రోగం ... ఈ మూడూ లేనివారు పాకలో బ్రతికినా...  వారే ఐశ్వర్యవంతులు . ఎందుకంటే వారికి ఎలాంటి వత్తిడి , వారిమీద ఎలాంటి ద్వేషాలు ఏమీ ఉండవు. వారు కష్టపడి సంపాదించుకున్న దానితో  కడుపు నింపుకొని హాయిగా ప్రశాంతంగా నిద్ర పోతారు. మనిషికి కావలసింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర . ఆ రెండూ ఉంటే ఏ రోగం రాదు . అలాగే వచ్చిన అవకాశాన్ని , జరుగుతున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి . ఒక సారి చేజారితే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు . ప్రస్తుత యాంత్రిక జీవితంలో కలవడానికి , విడిపోవడానికి చూపించే తొందర ... అర్థం చేసుకోకపోవడానికి, దగ్గరవడానికి ప్రయత్నిస్తే  ప్రతీ బంధం అందంగానే ఉంటుంది. అలాగే విలువైన వాళ్ళతో కాకుండా విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేస్తే మనం బాధపడే రోజు రాదు. మనిషి లో చెడు , మంచి అనే రెండు గుణాలు ఉంటాయి . గర్వం అనే చెడుగుణం ఉంటే  సర్వం  కోల్పోతారు., ధైర్యం అనేది ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలరు . మనిషిలో మానవత్వం అంటే ... ఆకలితో ఉన్న వారికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవారికి కొంచం సాయం , బాధలో ఉన్న వారికి కొంచం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. అంతేగానీ సంఘసేవ పేరుతో చేసేది కొంచం , అర్భాటాలు ఎక్కువ చేసేవారు మానవత్వ విలువలు కోల్పోయినట్లు . అది రాజకీయం అవుతుంది .  నిజమైన మానవత్వం గలవారు ఎదుటివారి పొగడ్తలు గురించి ఆలోచించరు. తమ పని తాము చేసుకుంటూ పోతారు.  వారికి భగవంతుడు ఎప్పుడూ తోడు గా ఉంటాడు . వారికి కష్టం వచ్చినప్పుడు ఏదో రూపంలో ఆదుకుంటాడు . 


 *శుభోదయం*

కామెంట్‌లు లేవు: