ఒక గొప్ప కథ ..
సముద్ర తీరాన *ఒక కుర్రాడు* ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే " *ఈ సముద్రం మహా దొంగ*"అని రాశాడు.
కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ *చేపలు* దొరకడంతో
" *ఈ సముద్రం గొప్ప దాత*" అని రాశాడు.
*ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు* మునిగి పోయాడు. అతని తల్లి ‘ " *ఈ సముద్రం*" నా కొడుకు లాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న *మహమ్మారి* " అని రాసింది.
ఒక *పెద్దతను* సముద్రంలోకి వెళ్లి *ముత్యాలు సేకరించి* విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో " *ఈ సముద్రం ఒకటి చాలు జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను* " అని రాశాడు.
*అనంతరం ఒక పెద్ద అల వచ్చింది.వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది*.
*రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచేసుకుంది.అలానే మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడరాదు*...
*ఇంకా ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటిని విని ఎవరి పైనా చెడు అభిప్రాయానికి రాకూడదు.* *వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి*. *ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు.మన చేతి ఐదు వేళ్లలా, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి*.
*దాని తొలగించి ముందుకు అడుగు వేయండి. భగవంతుని తోడుగా చేసుకోండి*..
*వినయం, విధేయతతో విజయం మీ సొంతం అవుతుంది.మనస్సాక్షి , భగవంతుడు ఒప్పుకునేలా జీవించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి