*ఒక తండ్రి తన పిల్లలకు వ్రాసిన ఒక లేఖ....*
నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలు:
1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.
2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.
3. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో
నీ గుండె గాయపడకుండా ఉంటుందని.
*ఈ క్రింద విషయాలు అతి జాగ్రత్తగా గుర్తుంచుకో....
1)నీతో సఖ్యముగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు. నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ ఉండదని బాగా గుర్తెరిగి మసలుకో.
నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు. అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది. నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులు అనుకొని, నమ్మి నీ మనసు గాయపరచుకునేవు సుమా!
2)ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు, తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.
ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.
3)జీవితం బహు చిన్నది.
ఒక్క రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించుకో.
4) ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన. కాలాన్ని, మూడ్ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీగాయాలను, బాధలను అన్నింటినీ కడిగేస్తుంది, కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనించు.
ప్రేమ సౌందర్యాన్ని , అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో ( Damn crazy movies! )
5)చాలామంది బాగా చదువుకోకుండానే జీవితంలో పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా
నీకు గొప్ప ఆయుధాలని గ్రహించు.
దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని మరచిపోకు.
6)నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను.
అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత సైకిల్ మీద తిరుగుతావా, బస్సులో తిరుగుతావా, నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకోవాలి.
7) ఇచ్చిన మాటను ఎంత కష్టమైనా నిలబెట్టుకో.
మనస్సు లో
ఆలోచించే ఆలోచన,
మాట్లాడే మాట,
చేసే పని
సత్యము,
న్యాయము ,
ధర్మము కలిగి యుండాలి
ఇతరులనుంచి ఇది ఆశించకు. నువ్వు అందరితో మంచిగా ఉండు, అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు వస్తాయి.
8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే(స్మార్ట్ గా) ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్స్ లేవని బలంగా నమ్ము.
9)దేవుని మీద పరిపూర్ణ విశ్వాసము,నిరీక్షణ కలిగి యుండు.
10)అది ఎంతకాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా మనస్సు లో దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా .
*(సమాజము పట్ల ఆరోగ్యవంతమైన భయము ఉన్న ఒక తండ్రి* ).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి