*2015*
*కం*
ధనములు గలవారికెపుడు
ఘనమగు సుఖముండునటుల కనబడుచున్నన్
ధనముల వెంబడి యెప్పుడు
కనుగానని సంకటములు కలవిల సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ధనములు గలవారికి ఎల్లప్పుడూ గొప్ప సుఖములు ఉండునట్లు కనిపించిననూ కంటికి కనబడని కష్టాలు ధనముల తో ఎల్లప్పుడూ ఉంటాయి.
*సందేశం*:-- ధనములు లేని వారి కి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎక్కువగా ఉంటాయి., కానీ, ధనవంతుల కు అటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉండవు, ఇలాంటి అనేక కష్టాలు ధనవంతుల కే ఉంటాయి.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి