🌹సాధనాసప్తకం🌹
🔹🔸🔹🔸🔹🔸
పుట్టుక, ముసలితనం, మరణం... ఇవేవీ లేని ఆనందస్వరూపుడైన పరమాత్మను పొందడం ఎలా?*
ఉపాసనాత్మకమైన జ్ఞానం ద్వారా పొందవచ్చని "ముండకోపనిషత్తు" చెబుతోంది.*
వివేక, విమోక, అభ్యాస, క్రియా, కళ్యాణ, అనవసాద, అనుద్ధర్షాలు* అనే *సాధనాసప్తకములు* ద్వారా సాధ్యము.
భగవంతునిపై భక్తి కలగడానికి ఉన్న ఏడు సాధనాలనే *‘సాధన సప్తకం’* అంటారు.
*1. వివేకం :
జాతిని బట్టి గాని, ఆశ్రయాన్ని బట్టి గాని, నిమిత్తాన్ని బట్టి గాని దూషితం కాని సాత్త్విక ఆహారాన్ని తీసుకొని, మనస్సుకు శుద్ధి కలిగించుకోవడం వివేకం. *‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః’* అను శ్రుతి అంతఃకరణ శుద్ధికి పరిశుద్ధాహారాన్నే తీసుకోవాలని తెలుపుతుంది.
గంజాయి, వెల్లుల్లి, మాంసము మొదలైనవి *జాతి దుష్టాలు.*
ఆచార హీనుల వద్ద ఉన్న వస్తువులను *ఆశ్రయదుష్టాలు* అంటారు.
ఎంగిలి, వెంట్రుకలు, కీటకాల వల్ల దూషితమైన ఆహారం *నిమిత్తదుష్టం*
ఈ మూడు దోషాలు లేని ఆహారం తీసుకుంటే *సత్వగుణం* అభివృద్ధిచెంది మంచి చెడులు గుర్తించగల వివేకం కలుగుతుంది.
*2. విమోకం :
భోగాలపై వ్యసన రూపమైన ఆసక్తి లేకుండా ఉండటం విమోకం.
*3. అభ్యాసం :
నిరంతరం భగవత్ ధ్యానంలో ఉంటూ బాహ్య విషయాలను మరచిపోవడం అభ్యాసం చేయడం.
*4. క్రియ :
తన శక్తిని అనుసరించి నిత్యం పంచమహా యజ్ఞాలు చెయ్యడం. అవి:
*దేవయజ్ఞం:* –
హోమం, అర్చనలతో ఇష్ట దేవతారాధన.
*బ్రహ్మయజ్ఞం:*
సదా వేదశాస్త్రాధ్యయనం.
*పితృయజ్ఞం:*
మాతాపితలకు సేవలు చేయడం.
*మనుష్య యజ్ఞం:*
అతిథి, అభ్యాగతులను ఆదరించడం.
*భూతయజ్ఞం*
గోవులు, తదితర జంతుజాలానికి ఆహారమివ్వడం వీటినే *‘క్రియా’* అంటారు.
*5. కల్యాణం:*
కల్యాణాలనబడే - (పంచ మహోత్సవములను) సద్గుణాలను కలిగి ఉండటం.
*"సత్యార్జన దయాదానాహింసా నభిద్యాః కల్యాణాని"*
*సత్యం*
సర్వ ప్రాణులకు హితకరమైన యదార్థ వచనం.
*ఆర్జవం*
మనోవాక్కాయాలలో ఏకరూపమైన ప్రవృత్తి.
*అనభిద్యః*-
పరుల ఆస్తులను దొంగిలించకుండా ఉండటం,
*అహింస,* *దయ* ఇత్యాది గుణాలను కలిగి ఉండాలి.
*6. అనవసాద:*
ఎటువంటి పరిస్థితుల్లోనూ దైన్యం అంటే మానసిక నిరుత్సాహం లేకుండా నిత్య నూతన ఉత్సాహంతో ఉండటం అనవసాదం.
*7. అనుద్ధర్షః:*
సంపదలు పెరిగాయనో, మహోన్నత పదవి లభించిందనో, జ్ఞానమో, రూపమో, గుణములో తమలో ఎక్కువగా ఉన్నాయనే భావనలతో
అతిగా సంతోషమును పొందకపోవడం.
ఈ సాధనాసప్తకం ముముక్షువులకు నిశ్చల భక్తియోగాన్ని ప్రసాదిస్తుంది.
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి