16, ఫిబ్రవరి 2021, మంగళవారం

శ్రీపంచమి




*శ్రీపంచమి*

 వ‌సంత‌పంచ‌మి

***********

స‌ర‌స్వ‌తీ దేవీ జ‌న్మ‌దినం

మాఘ శుక్ల పంచ‌మి

ఫిబ్ర‌వరి 16

*********


సకలవిద్యా స్వరూపిణి సరస్వతీ దేవి జన్మదినం మాఘ శుక్ల పంచమిని- శ్రీపంచమి గా చెబుతారు. 

వాక్కు బాగుంటే సకల విజయాలు మనవే. 

కనుక మనకు వాక్శుద్ధిని ప్రసాదించే ,జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీ మాతను

ఆరాధిద్దాం.

మాఘమాసం శుక్లపక్ష పంచమిని శ్రీపంచమి, వసంత పంచమి, సరస్వతి జయంతి, మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు.  శాంతమూర్తియైన

సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందనేది శాస్త్రోక్తి.


విద్యచేత వినయం, వినయం చేత జ్ఞానం, జ్ఞానం చేత ధనం, ధనం చేత అధికారం సంప్రాప్తిస్తాయి. సరస్వతీ ఆరాధన వల్ల వాక్సుద్ధి లభిస్తుంది. 

మనిషికి మాటే ప్రాణం కాబట్టి 

దేవిని ఆరాధించి మనిషి సద్బుద్ధిని పొందుతాడు. 

మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, 

ప్రజ్ఞ, స్ఫురణా శక్తుల స్వరూపమే శారదాదేవి

 కాబట్టి, శివానుజ అనీ పిలుస్తారు.

 కుల మత భేదాలు లేకుండా ప్రపంచంమంతా సరస్వతీ దేవిని పూజిస్తున్నా

 మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంది.

             🙏

         ఫిబ్రవరి 16

 శ్రీ పంచమి ,వసంత పంచమి

పర్వదినం.

 ఈ రోజు వీలైనన్ని ఎక్కువ సార్లు

సరస్వతీ స్తుతి లేదా

సరస్వతి అష్టోత్రం చదువుదాం.

కామెంట్‌లు లేవు: