22, సెప్టెంబర్ 2024, ఆదివారం

హైందవం వర్ధిల్లాలి 8*

 *హైందవం వర్ధిల్లాలి 8*




సముచిత జీవన శైలిని పునరుద్ధరించుకోవాలి, జీవన వ్యవస్థ మెరుగు పర్చుకోవాలి (v) :-  

క్రమం తప్పని దేవాలయ సందర్శనలు, సామూహిక తీర్థ యాత్రలు, పండుగల, పబ్బాల, పర్వ దినాల నిర్వహణ భారతీయ సంస్కృతిలోముఖ్యమైనవి.  మన విలువలు, భావోద్వేగాలు, ఆనందాలు, ఐక్యత పొందడానికి, అనుభవించడానికి ఇవన్నీ ఒక వేదిక,  ఒక మార్గం. ప్రభుత్వం గూడా ఇవన్నీ గమనించి ప్రజల సౌకర్యార్థం ముఖ్యమైన పండుగలకు సెలవులు ప్రకటించి ఉన్నది. *ఇట్టి సెలవులను సద్వినియోగం చేసుకో వలసి ఉన్నది, ఉంటుంది*. 


అందరికీ తెలిసిన విషయమే దేవాలయం అనేది ఒక ప్రశాంతమైన, శక్తిమంతమైన ప్రార్థనా స్థలం, ఆధ్యాత్మిక కేంద్రం, పూజా నిర్వహణలకు ఆలయం. తమ తమ ఇష్ట దైవాలను ఆరాధించడానికి, భగవత్ దర్శన సంతృప్తి  పొందడానికి, మానసికొల్లాసానికి  తమ శ్రమైక జీవన సౌందర్యానికి కృతజ్ఞతలు భగవంతునికి తెలుపడానికి *ప్రతి హిందువు దేవాలయం వెళుతాడు*.  అన్ని మతాలవారు దేవాలయాలకు వెళ్తారు, *వారి వారి సంస్కృతులకు ప్రతినిధులుగా నిలుస్తారు*. 


*హిందువులలో ప్రతి వ్యక్తి దేవాలయాలకు క్రమం తప్పకుండా వెళ్ళాలన్న సంకల్పబలం  రావాలి, పెరగాలి.* ప్రతి రోజూ దేవాలయ సందర్శన అదృష్టమే, అద్భుతం కూడా. అవుతే ఆ అవకాశం అందరికి లభ్యము కాక పోవచ్చును. ఆయా దేవతా వారములు పునః స్మరణ చేసుకుందాము. 

ఆదివారం సూర్య దర్శనం (సూర్య దేవాలయాలు అరుదుగా ఉండవచ్చును, అటువంటప్పుడు ఏ  దేవాలయానికైనా వెళ్ళవచ్చును). సోమవారం శివాలయాలు మరియు చంద్ర దర్శనం. మంగళవారం 

శ్రీ ఆంజనేయ స్వామి, దుర్గా అమ్మవారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. బుధవారం

 శ్రీ వినాయక మందిరం, 

శ్రీ సరస్వతీ దేవాలయం,

 శ్రీ మహా విష్ణువు. గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ  దక్షిణా మూర్తి దేవాలయం. శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామి,

 శ్రీ ఆంజనేయ స్వామి, 

నవ గ్రహ దేవాలయాలు. ప్రజలు ఒంటరిగా లేక కుటుంబ సభ్యులతో వెళ్లి రావడం ఒక్కటే అనుసరణీయం కాదు. దైవ దర్శనం తదుపరి తోటి భక్తులతో అరమరికలు లేకుండా అభిమానంగా, ఆప్యాయంగా,  గౌరవంగా దైవ చర్చలు గాని ఇష్టా గోష్ఠి గాని నెరపాలి. 


*హిందువులందరు సమైక్యంగా ఉన్నప్పుడే క్షేమంగా ఉండగలరు, కావలసినవి సాధించుకోగలరు*. 

ప్రతి హిందువు *బలగం పెంచుకోవాలి, బలం పెంచుకోవాలి, భద్రంగా ఉండాలి, తన జాతిని క్షేమంగా ఉంచాలి* *కావున మన హిందు ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.


ధన్యవాదములు.

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: