14, జూన్ 2023, బుధవారం

మోక్షపదం

 🔆🪷🔆🪷🔆🪷🔆🪷🔆

పదమూడో శతాబ్దంలో  జ్ఞానదేవ్ మహారాజ్ అనే సాధువు, కవి ఒక పిల్లల ఆట తయారు చేశారు. ఆ ఆట పేరు మోక్షపదం. 


తెలుగులో పరమ పధ సోపాన పఠం  లేదా వైకుంఠ పాళీ అంటారు.


చిన్నతనంలో మనం అంతా కూడా వైకుంఠ పాళీ అడే ఉంటాం.


మన సంస్కృతిని, ఆచారాలను అన్నిటినీ నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న ఇంగ్లిషోడి కన్ను ఈ మోక్షపదం పై పడింది.


 ఆటల్లో కూడా మనవారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు అని గ్రహించి ఆ ఆటని మొత్తం బ్రిటీష్ వాడు మార్పు చేసి Snakes and Ladders గా విడుదల చేసాడు..


వారికి కలిసి వొచ్చిన అంశం అప్పటికి ముద్రణా వ్యవస్థ అందుబాటు లోకి రావడం.


అలా మోక్ష పదం కాస్తా వైకుంఠపాళి గా రూపాంతరం చెందింది.


పాత కొత్త ఆటలో వంద చతురస్రములు ఉంటాయి.., తేడా వొచ్చి మన కవి ఋషీశ్వరులు జ్ఞానదేవ్ రూపొందించిన ఆటలో... 


12 వ చతురస్రం అంటే 'నమ్మకం' అని, 

51 వ చతురస్రం అంటే 'విశ్వసనీయత' అని...

57 వ చతురస్రం వొచ్చి 'దాతృత్వాన్ని' సూచిస్తుంది., అలాగే 

76 వ చతురస్రం 'జ్ఞానాన్ని' సూచిస్తుంది...

78 వ చతురస్రం 'ముని వృత్తి'ని సూచిస్తుంది..


ఆ గళ్ళ క్రింద నిచ్చెన ఉంటుంది . ఆ గడిలో పాచిక పడితే నిచ్చెన ఎక్కి వేగంగా ఆటలో పైకి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది.


అలాగే 41వ గడి 'అవిధేయతకు' ప్రతీకగా,

 44 వ చతురస్రంలో పడితే 'అహంకారం' అని, 

49 వ గళ్లోకి పడితే 'అశ్లీలత' అని, 

52 వ గడిలోకి ప్రవేశిస్తే 'దొంగతనం' అని, 

58 వ గడిలో 'అబద్దలాడుట' అని, 

62వ చతురస్రంలో ప్రవేశిస్తే 'తాగుబోతు' అని, 

69 వ గదిలోకి అడుగు పెడితే 'అప్పుల పాలు' అని,

73 వ గడిలోకి ప్రవేశిస్తే 'హంతకుడు/హత్యలు' అని,

 84 వ చతురస్రం లోకి వెళితే 'కోపిష్టి' అని,

 92 వ చతురస్రం 'దురాశ ను' 

95 వ గడి 'గర్వాన్ని' సూచిస్తాయి.. చివరగా 99 వ గడి 'కామాన్ని' సూచిస్తాయి.. 


ఈ గళ్ళల్లో పాము నోరు తెరుచుకుని ఆయా గుణాలను బట్టి కిందకు జారిపోతారు. 


ఆటలోనే మంచి చెడు నేర్చుకోవాలి అని ఋషీశ్వరులు చెప్పకనే చెప్పారు అని తెలుస్తుంది పిల్లలకు.. చెడు మార్గాన్ని ఎంచుకునే వారు అదఃపాతాళానికి చేరుకుంటారు.మంచి గుణాలు అలవర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతాము అని ఆటలో కూడా చెప్పడం.. 

100 వ చతురస్రరం లోకి ప్రవేశిస్తే "మోక్షం"..


ప్రతి నిచ్చెన పై భాగంలో ఎవరో ఒక దేవుడు/దేవత లేకపోతే వివిధ స్వర్గాలో, కైలాసం, వైకుంఠం లేదా బ్రహ్మలోకం ఇలా ఉంటాయి..


ఆట ఆడుతుంటే పిల్లలకు ఉత్సాహంగా నిజజీవితం లోని ఒడిదుడుకులు కనిపిస్తాయి. నిచ్చెన ఎక్కితే మంచి కర్మలు చేసినట్టు, పాము నోట్లో పడితే పాపాలు పడినట్టు రూపొందించారు.


అంతటి మహత్తరమైన ఆటను కూడా వక్రీకరించి తమదైన ముద్ర వేసుకొని ఏ విధమైన సందేశం లేకుండా చేశాడు బ్రిటిషోడు.. కాల మహిమ..

కామెంట్‌లు లేవు: