*శ్రీమాత్రేనమః*
*659వ నామ మంత్రము*
*ఓం సర్వాధారాయై నమః*
అనంత విశ్వంలో గ్రహముల, తారల వివిధ గోళముల తత్త్వములు మారకుండా,గమనములలో విధ్వంసకర మైన మార్పులు రానీయకుండా సునిశితమైన పరిశీలనతో, నిపుణమైన పర్యవేక్షణతో నడుపుతూ, విశ్వనహణా కార్యక్రమములకు మూలనియంత్రణ శక్తిగా, సర్వధారయై విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.
స్వాధిష్ఠానాది షట్చక్ర శక్తికేంద్రములకు మూలాధారమే ఆధారం. కుండలినీ శక్తి జాగృతమగుటకు కారణమైన పృథివీతత్త్వముగల మూలాధారమునకధిష్ఠాన దేవతయై సహస్రార సుధాధారలలో సాధకుడు ఓలలాడుటకు సర్వాధారమైన జగదీశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సర్వాధారా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సర్వాధారాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని అర్చించు భక్తుడు సుఖసంతోషములతో జీవించి పరమేశ్వరి అనుగ్రహముతో తరించును.
గ్రహగోళములు, తారలు వాటి తత్త్వములు మారకుండా, నడకలో విధ్వంసకరమైన మార్పులు జరగకుండా అత్యంత నిశితమైన, నిపుణమైన పర్యవేక్షణతో సరైన మార్గంలో నడుపుతూ, విశ్వనిర్వహణా కార్యక్రమములకు మూలనియంత్రణ శక్తిగా జగన్మాత విరాజిల్లుతున్నందున ఆ తల్లి *సర్వాధారా* అయినది.
స్వాధిష్ఠానాది షట్చక్ర శక్తి కేంద్రములకు మూలాధారమే ఆధారం. పృథివీతత్త్వం గలిగిన మూలాధారమందు అన్నిశక్తులు ఇమిడి ఉంటాయి. కుండలినీ శక్తి జాగృతమై ఇచ్చటనుండి బయలుదేరి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులు ఛేదించుకుంటూ, షట్చక్రములకావల సహస్రారమందు అమృతధారలలోసాధకుని ఓలలాడించు మూలాధార అధిష్ఠానదేవతయే జగన్మాత. అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మూలాధారాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻ఈ రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు ఈ రోజు చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి