2, సెప్టెంబర్ 2020, బుధవారం

*శ్రీమాత్రేనమః*



*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*82వ నామ మంత్రము* 2.9.2020

*ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ద సభండాసుర శూన్యకాయై నమః*

అత్యంత శక్తివంతమైనది, ముల్లోకములందు సాటి లేనిది, చిదగ్నికి మారుపేరైనది, ప్రళయకాలాగ్నికి ప్రతిరూపమైనది అయిన కామేశ్వరాస్త్రముతో భండాసురుని, అతని శూన్యకనగరమును నిశ్శేషముగా దహింపజేసిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కామేశ్వరాస్త్ర నిర్దగ్ద సభండాసుర శూన్యకా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ద సభండాసుర శూన్యకాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో జగన్మాతను ఉపాసించు సాధకుడు బ్రహ్మానందము, ఆత్మానందానుభూతి కలిగి తరించును.

భండాసురుని సైన్యము, అతని పుత్రులు, సేనానాయకులు అందరూ సంహరింపబడినారు. అత్యంతభయంకరుడైన భండుడు అతని నగరము *శూన్యకానగరము* మిగిలి ఉన్నాయి. భండుని చంపడానికి సామాన్యమైన అస్త్రములు చాలవు. అస్త్రరాజములలో మహాభయంకరమైనది, ప్రళయకాలాగ్ని సమానమైనది, ముల్లోకములందు సాటిలేనిది, చిదగ్ని స్వరూపమైన కామేశ్వరాస్త్రమును ప్రయోగించి శత్రుశేషమైన భండాసురుడు, అతని శూన్యకనగరము నిశ్శేషముగా దహింపజేసి లోకమునకు శాంతిచేకూర్చినది శ్రీమాత.

కామేశ్వరాస్త్రం అంటే చిదగ్ని. మానవునిలో చిదగ్ని ఫ్రకాశించినట్లైతే ద్వైతభావమైన జీవస్వభావం నశిస్తుంది. అప్పుడు ఆత్మశక్తి ప్రకాశిస్తుంది. అరిషడ్వర్గాలతో జీవినాశనమవుతాడు. భండుని వంటి అసురీభావం నాశనమవడానికి కామేశ్వరుడు అనే కామేశ్వరాస్త్రం జగన్మాత ప్రయోగించి అసురీ భావం నాశనంచేసిన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ద సభండాసుర శూన్యకాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻ఈ రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు ఈ రోజు చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు: