2, సెప్టెంబర్ 2020, బుధవారం

సంచలన నిర్ణయం

🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం

హైదరాబాద్: ఆల్రెడీ ఓ స్కూల్లో చదువుకుంటూ... అక్కడ మానేసి... మరో స్కూల్లో చేరాలంటే... తప్పనిసరిగా కొత్త స్కూల్లో టీసీ సమర్పించాల్సి ఉంటుంది. ఐతే... తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీసీ లేకపోయినా విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించింది. దీని వెనకాల బలమైన కారణం ఉంది. లాక్‌డౌన్‌ను అడ్డం పెట్టుకొని... ప్రైవేట్ స్కూళ్లు... విద్యార్థులు, తల్లిదండ్రులపై ఫీజుల కోసం ఒత్తిడి పెంచుతున్నాయి. దాంతో ఆ ఫీజులు చెల్లించలేక, తమ పిల్లల్ని వేరే ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించుకోలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ మాన్పిస్తామంటే... ఫీజు బకాయిలు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని కండీషన్ పెడుతున్నాయి ప్రైవేట్ స్కూళ్లు.
లబోదిబో మంటున్న తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అందుకే ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు తమిళనాడులో భారీ ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో మాన్పించి, ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. అడ్మిషన్లు బాగా పెరిగాయి. కొన్ని నెలలుగా తాము పడుతున్న ఆవేదనకు ప్రభుత్వం సరైన పరిష్కారం చూపిందని తల్లిదండ్రులు ఎంతో ఆనందపడుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు టీసీ ఇవ్వకుండానే ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పొందవచ్చు. అడ్మిషన్లు ఆలస్యం కాకుండా... అన్ని స్కూళ్లలో హెడ్‌మాస్టర్లు రెడీగా అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆర్డరేసింది.

ఇప్పటి వరకు ఒకటో తరగతిలో లక్షా 72 వేల మంది కొత్తగా చేరారు, ఇంకా చాలా మంది చేరుతున్నారు. టెస్ట్ బుక్స్ రెడీగా ఉన్నాయి. పైగా ప్రభుత్వం 14 రకాల వస్తువుల్ని ఉచితంగా ఇస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రూల్ వస్తే బాగుండంటున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే మన ఏపీ, మన తెలంగాణలో కూడా ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా టైంలో తినడానికే డబ్బు లేనప్పుడు... ఇక ఫీజులెక్కడ చెల్లించగలం అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మన రాష్ట్ర ప్రభుత్వము కూడా టీసీలతో పనిలేకుండా ప్రభుత్వ స్కూళ్లలో చేరొచ్చనే ఆర్డర్ ఇస్తే... వెంటనే చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్లలో చేర్పించే ఛాన్స్ ఉంటుంది సర్.

మన గ్రూపులో ఉన్న పెద్దలు కూడా దయచేసి ఒకసారి ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళగలరని‌ ఆశిస్తున్నాను. 🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: