*ఈరోజు పితృ దినోత్సవం*
🙏💐💐💐💐🙏
*వేదం ‘పితృదేవోభవ’ అంటూ తండ్రిని దైవంగా చూడాలని చెబితే, శాస్త్రాలు ఆయనకి విష్ణు స్థానమిచ్చాయి. జగత్తును పాలించి పోషించేది విష్ణుమూర్తి. అందువల్ల కుటుంబాన్ని పోషించే తండ్రిని విష్ణు సమానుడిగా చెప్పాయి.*
*‘నమో పిత్రే జన్మధాత్రే* *సర్వదేవమయాయచ। సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే।।దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మయావపుః। సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః...ఇలా సాగుతుంది బృహద్ధర్మ పురాణంలో పితృస్తుతి. దుర్లభమైన మనుష్య జన్మ ఇచ్చి, సుఖంగా జీవితాన్ని గడిపేలా చేస్తూ, చిన్ననాటి నుంచి తప్పులన్నీ క్షమిస్తూ, మంచి మార్గంలో నడిపే తండ్రిని ఆ పురాణం ఎంతగానో కీర్తించింది*
*అయ్య, బాపు, నాన్న, తండ్రి, డాడీ, ఫా, అబ్బాజాన్, పప్పా ఇలా పిలడవానికి ఎన్ని పేర్లున్నా ఒక్కో తండ్రికి ఆకాశమంత చరిత్ర ఉంది. కని పెంచి కడుపు చూసేది అమ్మైతే.. నడిపించి భవిష్యత్తుని చూసేవాడే నాన్న..అమ్మ కనిపించే వాస్తవమైతే.. నాన్న ఓ నమ్మకం.. లాలించేది అమ్మ ఒడి.. నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోల పాట ఎలాగో.. నాన్న నీతి పాఠం కూడా అలాగే ఉంటుంది. తమ కన్నా మిన్నగా బిడ్డ తయారు కావాలని కలలు కనేది కన్నవారే. నాన్న మనకోసం తన జీవితాన్ని త్యాగంచేసే త్యాగమూర్తి. మనం ఓడినప్పుడు నేనున్నా అంటూ ఓదార్చే ఎమోషన్ నాన్న.. మనం గెలిచినప్పుడు పదిమందితో చెప్పుకునేవాడే నాన్న… మన నుంచి కృతజ్ఞతలు ఆశించని అమాయక చక్రవర్తి నాన్న.. ప్రపంచంలో అమ్మకు ఎంత గొప్ప స్థానం ఉందో నాన్నకు కూడా అంతే గొప్ప స్థానం ఉంది. అటువంటి నాన్నకు ప్రతీఒక్కరు రుణపడి ఉండాలి. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పొస్టులు పెట్టి చేతులు దులుపుకోవడం, వాట్సాప్ లో స్టేటస్ పెట్టి ప్రపంచాన్ని జయించినట్టు ఫీలయ్యే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అయితే నాన్నకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి శుభాకాంక్షలు చెప్పడం కాకుండా మన పక్కనే ఉండే నాన్నతో కాసేపు మాట్లాడితే నాన్న ఎంతో సంతోషంగా ఫీలవుతారు. లాభం ఆశించకుండా నిస్వార్థంగా కొడుకుల కోసం జీవితాన్ని ధారపోస్తున్న నాన్నలందరికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు.*
🙏🙏💐💐🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి