పెళ్లిపైన తండ్రి తనయ సంభాషణ:-
తనయ: నాన్న పెళ్లి తర్వాత జీవితం మారిపోతుందని ,ఆంక్షలు ఎక్కువవుతాయని అంటారు నిజామా?
తండ్రి: చిన్నప్పుడు గజ్జెలు గజ్జెలు కావాలని తెగ మారం చేశావు, చాలా షాపులు తిరిగి నీవు ఇష్ట పడ్డ గజ్జెలే కొన్నాను.
అవి బాగా బరువుగా గట్టిగా ఉన్నాయి కానీ అవే కావాలన్నావు. సరే ఇంటికొచ్చి
అవి కట్టుకుని అటు ఇటు పరుగెత్తుతున్నావు. అది చూసి ఏమ్మా నొప్పిగా ఉన్నాయా అని ఊరికినే అడిగాను. అప్పుడు ముద్దుగా ఒక మాటన్నావురా
అవి బరువుగా గట్టిగా ఉన్నాయి కానీ నడుస్తున్నప్పుడు ఘల్లు ఘల్లు మనే శబ్దం బేక్ బాగుంది తెయ్యొద్దు నాన్న అన్నావు. పెళ్లి కూడా అంతేరా. కొంచె బరువుగా , కొంచెం భయంగా ఉంటుంది,
కొంచెం మొహమాటంగా, కొంచెం బాధగా కూడా ఉంటుంది. దానివల్ల వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు . కానీ కూతురంటే తప్పదుగా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి