11, ఫిబ్రవరి 2024, ఆదివారం

దయచేసి సహాయం చేయండి.

 దయచేసి సహాయం చేయండి. 

సబ్యులకు నమస్కారం నేను చాలా  పేదవాడిని. నేను నా పెద్ద కుమార్తె వివాహం చేయాలని అనుకుంటున్నాను. దైవానుగ్రహంతో ఒక మంచి సాఫ్టువేరు ఇంజనీరు దొరికాడు.  వివాహానికి ముహుతంకూడా కుదిరింది.  కానీ చేతిలో డబ్బులు లేకపోవటంతో నేను మిమ్మలను వేడుకుంటున్నాను. ఇక పేదవానికి సహాయపడితే భగవంతుడు మీకు తప్పకుండ మేలుచేస్తాడు. నాకు నా కుమార్తె పెండ్లి చేయటానికి చాలా ద్రవ్యం కావలసి వున్నది.  ఖర్చులు ఈ క్రింది విధంగా వున్నాయి. 

కల్యాణ మండపానికి రూ. 10 లక్షలు 

మండప డెకరేషనుకు రూ. 10 లక్షలు 

కేటరింగుకు రూ. 15 లక్షలు 

పెండ్లి కుమారుని కట్నానికి రూ. 30 లక్షలు 

పెండ్లి కుమారుడికి కారు క్రింద  రూ. 30 లక్షలు  

పెండ్లి కుమారుడికి డ్రస్సుల క్రింద  రూ. 20 లక్షలు   

అత్తమామల మరియు ఇతరులకు అప్పగింతలకు రూ. 30 లక్షలు 

పెండ్లి చేయించిన బ్రాహ్మణునికి రూ. 5 లక్షలు

ఆడబిడ్డల కట్నాలు ముగ్గురుకి ఒక్కొక్కరికి రూ. 12 లక్షలు (15 లక్షలు అడిగితె బ్రతిమిలాడితే తగ్గించారు)

ఫొటోగ్రాఫరులకు రూ. 15 లక్షలు

ఇతర సాదారుకర్చులక్రింద  రూ. 30 లక్షలు 

ఈ విధంగా ఖర్చులు వున్నాయి కాబట్టి దయచేసి మన గ్రూపు సభ్యులు అందరు స్పందించి వారి వారి స్థితిని పట్టి నాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. ధన రూపేణ సహాయం చేయలేని వారు క్రింది వస్తువులను బహుమతులుగా ఇచ్చి కూడా సహాయం చేయగలరు. 

1. మిక్సీ, 2వ్వాషింగ్ మిషను, 3అంట్లుతోమే మేషను, 4. ఎయిర్ కండిషనర్ ఇవ్వలేని వారు ఎయిర్ కూలరు 5. ఇల్లు ఊడిచే మిషను. ఇంకా సోపాలు, కుర్చీలు, స్టీలు సామానులు, మంచాలు, ప్యానులు కూడా ఇవ్వవచ్చు.  ఎవిరి స్తోమతకు తగినట్లుగా వారు ఇవ్వగలరు. గ్రూపు సభ్యులు అందరు తప్పకుండ పెండ్లికి రాగలరు. గురుతుంచుకోండి మీరు కానీసం ఒక లక్షకు తక్కువకాకుండా సహాయపడగలరు.  మీ సహాయాన్ని నేను ఎప్పటికి గుర్తుంచుకుంటాను. 

ఇది చదివితే మీకు హాస్యంగా అని పింఛ వచ్చు.  కానీ ఇటీవల చాలా పోస్టులు ఈ కోవకు చెందినవిగానే కనపడుతున్నాయి.

 

 

 

కామెంట్‌లు లేవు: