20, సెప్టెంబర్ 2020, ఆదివారం

హిందూ ధర్మం - 2

 దశిక రాము




మతం అంటే ఒక వ్యక్తి లేదా ఒక సమూహం యొక్క మనసు నుంచి పుట్టిన ఒక ఆలోచన. మనసు (మతి) నుంచి పుట్టినది కనుక మతం అన్నారు. 'మీ అభిమతం చెప్పండి' అన్న మాట వింటూ ఉంటాం. మీ అభిమతం చెప్పండి అంటే మీ అభిప్రాయం చెప్పండి అని అర్దం. ఇది ఇలా ఉంటే బాగుండు, ఇది ఇలా జరిగితే మంచిది అని మనకు అనిపిస్తుంది కదా, అది మన మతం అన్నమాట. క్రైస్తవం, ఇస్లాం, జైనం, భౌద్ధం మొదలైనవన్నీ మతాలు. మతానికి ప్రవక్తలు ఉంటారు, మూలపురుషులు ఉంటారు, మతం ప్రపంచ చరిత్రలో భాగం. హిందూ ధర్మం ఒక వ్యక్తి లేదా ఒక సమూహం యొక్క ఆలోచనా విధానం కాదు.


మతం మనసు నుంచి పుట్టుందనుకున్నాం కదా. ఈ మనసు కాలానికి, పరిమితులకు లోబడి ఉంటుంది. కనుక మనసుకు కలిగే ఆలోచనలు కూడా కాలానికి అతీతమైనవి కాలేవు, అపరిమితమై ఉండవు. మతం ఎప్పుడు కాలానికి, చరిత్రకు, పరిమితులకు లోబడి ఉంటుంది.


ఏసు క్రీస్తు క్రైస్తవానికి మూలపురుషుడు. ఏసుక్రీస్తు తన జీవత మధ్యభాగంలో ఇచ్చిన భోధనలతో క్రైస్తవం ప్రారంభమైంది. మహమ్మద్ ప్రవక్త తన జీవత సగభాగం గడిచిన తరువాత ఇచ్చిన భోధనలతో ఇస్లాం ప్రారంభమైంది. బుద్దుడి భోధనలతో భౌద్ద మతం వచ్చింది. అట్లాగే జైనమతం కూడా. అంటే ఈ మతాలకు మూలపురుషులు ఉన్నారు. వీళ్ళ గురించి చరిత్ర చెబుతుంది. చరిత్ర వీళ్ళ కాలం గురించి ప్రస్తావించింది. ఈ ప్రవక్తలు తమ మతాలను ప్రవచించకముందు, ఆయా మతాలు లేవు. మనం ఒక విషయం గమనిస్తే, ఈ ప్రవక్తలు తమ బాల్యంలో వేరొక సంస్కృతిలో పెరిగినవారే. వారి పూర్వీకులు వేరే ధర్మాలను పాటించారు.


కానీ హిందూ/సనాతన ధర్మం ఏ యొక్క వ్యక్తి వల్ల ప్రారంభించబడలేదు. దీనికి మూలపురుషులు లేరు. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు పుట్టకముందు ఈ ధర్మం ఉన్నది. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడి జీవితాలు గమనిస్తే, వారు పుట్టకతో హిందువులే. వారి పూర్వతరంవారు పరంపరాగతంగా పాటిస్తున్న వస్తున్న ధర్మాన్నే శ్రీ రాముడు పాటించాడు, శ్రీ కృష్ణుడు పాటించాడు. అంతే తప్ప కొత్తగా శ్రీ కృష్ణుడు చెప్పిందేమి లేదు. వీరు హిందూ జీవన వాహినిలో మైలురాళ్ళు మాత్రమే.


తరువాయి భాగం రేపు


హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


ధర్మో రక్షతి రక్షితః

🙏🙏🙏

https://t.me/SANAATANA


ధర్మో రక్షతి రక్షితః

🙏🙏🙏

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95


ధర్మో రక్షతి రక్షితః

🙏🙏🙏

https://www.facebook.com/groups/365624084602145/?ref=share

కామెంట్‌లు లేవు: