మనసు ఇంద్రియాలకి ఆవల ఉంటుంది. అది తలచుకుంటే ఇంద్రియాలని నియంత్రించగలదు. ఇంద్రియాలు మనసుని అనుసరిస్తాయి. కానీ నీవు నీ మనసుని ఇంద్రియాల వెనుక వెళ్ళేలా అనుమతిస్తున్నావు. మనసు ఆవల బుద్ధి ఉంటుంది.. నీ మనసు ఏ పని చేస్తున్నా అక్కడ నీ బుద్ధి ఉండేలా చూడు. అప్పుడు మనసు వినయంగా ఉంటుంది. బుద్ధికి అతీతంగా ఆవల వుండే బ్రహ్మమే పరమ సత్యము. అదే బుద్ధికి మూలము. ఇంద్రియాలు, మనసుకి; మనసు, బుద్ధికి; బుద్ధి, పరమసత్యానికి సమర్పణ చేసుకోవాలి.
అహంకారం అనేదాన్ని సన్న్యసించిన వాని లోపలి నుండి పరమాత్మ మాట్లాడుతూ ఉంటాడు.
జీవితపు పరమ నియమాలలో, మరో నియమం ఏమిటంటే, దృశ్యం అదృశ్యం పైన, పదార్థం పరమాత్మ పైన ఆధారపడి ఉంటాయి.
సత్యం అనేది ఒక గొప్ప అతిధి. దాని కోసం అన్ని తలుపులూ ఎప్పుడూ తెరిచి ఉంచాలి. స్నేహంతో కూడిన శ్రద్ధ, భరోసా, విశ్వాసం లేకుంటే సత్యం గురించి చెప్పినా వినిపించుకోవడం జరుగదు. సత్యం గురించి వినాలి అంటే ఎదురుచూడాలి, వేచి ఉండాలి.
శరీరం మీద దృష్టి ఉన్నప్పుడు, శరీరానికి ఆవల ఉన్న వాటి మీద దృష్టి మరలదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి