🕉️⚜️🚩 ఓం నమో వేంకటేశాయ 🙏
🚩మన తెలుగు లోగిళ్లు...
"కౌసల్యా సుప్రజా రామా". అను...
సుప్రభాతం తో మేల్కొంటాయి.
⚜️🚩"విశ్వామిత్రుడు" శ్రీ రాముడిని నిద్ర లేపుతూ...
కౌసల్యా సుప్రజా రామా! పూర్వాసంధ్యా ప్రవర్తతే !
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం!
...అంటాడు.
🚩అసలు సుప్రభాతం... ఈ శ్లోకము తోనే ఎందుకు మొదలైంది!!? అని ఆలోచిస్తే...
ఇందులో మనకు ఒకటి అర్థమవుతుంది.
⚜️🚩 👉 "కౌసల్యా సుప్రజా రామా!"...
అంటే ఇక్కడ రాముడు🙏... అనగా మేలుకోబోయే వ్యక్తి... అతడిని మేలుకొలపాలి.
♦️గాఢముగా నిద్ర పోతున్న వ్యక్తిని... ఉన్నట్టుండి మేల్కొలపడం ప్రమాదకరం.
♦️ఎటువంటి వ్యక్తి అయినా తన తల్లి పేరు విన్నంతనే... తన దృష్టిని అటువైపు త్రిప్పుతాడు. అందువల్ల మొదట తల్లి పేరు పలికినారు.
♦️అంతే కాక ప్రత్యక్ష దైవమైన తల్లిని మొదట అతడికి గుర్తు చేస్తూ... తర్వాత ఆ మేల్కోబోయే వ్యక్తి పేరు ("రామా!") పిలుస్తున్నాము.
👉"సుప్రజా" అంటే... మంచి బిడ్డవు అని అర్థము.
⚜️🚩తర్వాత మాత్రమే...
👉 "పూర్వాసంధ్యా ప్రవర్తతే"...
అంటే తెల్లవారుతోంది నాయనా అంటున్నారు.
♦️అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు... ఉదయించడానికి తయారుగా ఉన్నాడు. ♦️తెల్లవారుఝామునే లేవడం ఎంతో మంచిది అని మన అందరికీ తెలుసు.అందుకే ఆ సమయానికే ఇక్కడ మేల్కొల్పడం జరుగుతోంది.
⚜️🚩 👉 "ఉత్తిష్ఠ నరశార్దూలా"...
అంటే "ఓ మనుషులలో పులి లాంటి వాడా లెమ్ము" అంటున్నారు.
♦️మనము చూస్తూనే ఉంటాము పిల్లలను లేపేటప్పుడు... లేవరా " బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకొనే ఉన్నావు...
♦️పక్కింటి అబ్బాయి చూడు మంచి ర్యాంకు తెచ్చుకొన్నాడు... నువ్వూ ఉన్నావు ఎందుకు... తినడానికి..నిద్రపోయేదానికి ఎప్పుడూ తయారుగా ఉంటావు" అంటూ తిడుతూ... లేపుతుంటారు
అందువలన లేచేటప్పుడే పిల్లలు ఒక విధమైన బాధతో లేస్తుంటారు.
♦️అలాకాకుండా తన శక్తి సామర్థ్యాలను గుర్తు చేస్తూ... ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ...
మేల్కొల్పితే ఎంత ఆనందముగా,ఉత్సాహము తో మేల్కొంటారు.
♦️తర్వాత ఆ రోజు ఎంత ఉత్సాహముగా తమ పనులను చేసుకొంటారు.
అందుకే ఈ విధంగా మేల్కొల్పాలని మనకు నేర్పుతున్నారు.
⚜️🚩 👉"కర్తవ్యం దైవమాహ్నికం"...
అంటే నీకు దైవం చే విధించబడిన...అంటే నీవు చేయవలసిన పనులు...
(చదువుకోవడం కావచ్చు లేక ఉద్యోగం కావచ్చు లేక మరే వ్యాపారమో,సేద్యమో ఏదైనా కావచ్చు) చేయవలసి ఉంది అని గుర్తుచేస్తున్నారు.
♦️అందుకని తెల్లవారుఝామునే లెమ్ము నాయనా అంటూ ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగిస్తూ మేల్కొల్పడం చేయాలి.
⚜️🚩రాముడిని నిమిత్తముగా చేసుకుని...
సకల జీవరాశులను ఇలా మేల్కొలుపుతున్నారు
అనమాట 🙏
🌷🌷ఓం నమో వేంకటేశాయ 🌷🌷
⚜️♦️⚜️♦️⚜️♦️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి