సంక్రాతి లక్ష్మి
మార్తాండు డెప్పుడు మకరరాశిని జేరు
ఉత్తరాయణ మగు నుర్వి నపుడు
సకల జనాళియున్ సంక్రాంతి పండువన్
సంతోష చిత్తాన జరుపు కొంద్రు
కర్షకుల్ పంటను కడు తోషమున పొంది
పొంగలి నొండియు పొంగు చుంద్రు
ఆడపడచులెల్ల ఆనంద డోలల
ముంగిట గొబ్బిళ్ళ మురియు చుంద్రు
ముదము గూర్చెడి ముత్యాల ముగ్గులలర
గాలి పటముల సందడి గోల లందు
సకల జనులకు నొనగూర్చ సంతసంబు
ఘనముగా వచ్చె నేడు సంక్రాంతి లక్ష్మి
మీకు, మీ కుటుంబ సభ్యులందరికి
హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు
గోపాలుని మధుసూదన రావు, సులోచన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి