*ప్రియ బాంధవా మేలుకో 11*
వస్తు గుణాల మరియు పరిస్థితుల ప్రాబల్యం ఏలా ఉంటుందంటే.....ఎండాకాలం భూమి వేడి నుండి రక్షించే పాదరక్షలే (చెప్పులు), వానాకాలం నడుస్తున్నప్పుడు ఆ భూమిపై ఉండే బురదనే మనపైకి చల్లుతాయి. అలాగే వంటకాలను రుచిగా మార్చే *ఉప్పు*, పాలలో వేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి.
గత వ్యాసంలో భారత దేశ అభివృద్ధిని అమృత తుల్యమైన క్షీర భాండంతో పోలుస్తూ, అక్కడే ఉన్న ఉప్పు కళికలను గూడా సామాజిక రచయితలు గమనిస్తూ ఉంటారని తెలుసుకున్నాము. క్షీరమును = పాలను, విరుచునది= చెడుపు చేయునది *ఉప్పు* అను విషయము జన సామాన్య జ్ఞానము. భారత కీర్తి కిరీటానికి మూలకారణమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, దేశ సుఖ శాంతులకు హాని (ఉప్పు లాంటి) కారక ఘటనలను పరిశీలిద్దాము.
ఒక వర్గపు దేవాలయాల ఆదాయము, ఆస్తులు మరియు భూములపై ప్రభుత్వ ఆజమాయిషి. మరి,అన్యమత మందిరాలపై, ఆదాయలపై అజమాయిషీ ఉండదు. అది *ప్రజాస్వామ్యానికే మచ్చ*. బొట్టు పెట్టుకున్నారని బడిలో పిల్లలను దండించే యాజమాన్యాలు. పరీక్షా కేంద్రాల వద్ద ఒక వర్గం వారిని తరచి తరచి, తడిమి తడిమి పరీక్ష చేయుట. నిండుగ వస్త్రములు ధరించి వచ్చిన మరో వర్గం వారికి నామ మాత్రపు తనిఖీలు. ఇవి *ప్రజాస్వామ్యానికే మచ్చ*.
ఒక వర్గపు పండుగలు, ఊరేగింపులప్పుడు వందల వందల భద్రతా సిబ్బంది. కనీస జ్ఞానమున్న వారెవరికైనా విశదమే ఎవరివలన ఎవరికి అపాయము, ప్రమాదమని. దేశంలోని కొన్ని ప్రాంతాలలో భద్రతా సిబ్బందికే భద్రత కరువు. కొన్ని రాష్ట్రాలలో అందులో ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలలో విద్యుత్, నీటి పన్నుల వసూలులకు ఆటంకము, ప్రభుత్వ సిబ్బంది నిస్సహాయ స్థితి. ఇది *ప్రజాస్వామ్యానికే మచ్చ*. చిన్నారి బాలికలు మరియు మహిళల మాన భంగాలు. ఏటా 4.50 లక్షల అఘాయిత్యాలు. ఆసుపత్రుల నుండి పసికందుల అపహరణ మరియు అమ్మకాలు. లంచగొండితనము ప్రత్యేక వివరణ అవసరంలేని అంశము. జనన మరణ ధ్రువ పత్రాలకు, కుల, నివాస ధ్రువీకరణకు, భూమి పత్రాలు పొందుటకు, అధిక శాతం ప్రభుత్వ అనుమతులకు.. వెయ్యేల...సర్వత్రా లంచగొండితనం వ్యాపించి ప్రజలను పీడిస్తున్నది. ప్రహ్లాద చరిత్రలోని *ఇందుగలడందు లేడను* పద్యం జ్ఞాపకము వస్తున్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే లంచగొండితనం సామాజిక జీవనంలో భాగమైఉన్నది. చట్టాలు ఎన్ని ఉన్నా ఏమి ఉపయోగము. అధిక శాతం ప్రజలు నైతికత కోల్పోయి ఉన్నారు.
*ప్రజా చైతన్యం వెల్లి విరిసిన చోట మరియు జన సమైక్యత వల్ల మాత్రమే దుష్టులు భయపడతారు, అరాచకాలు మానుతారు*.
ధన్యవాదములు
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి