24, నవంబర్ 2023, శుక్రవారం

సుభాషితం

 *జైశ్రీరామ్*


                       7-5-2020

                      అభ్యాసం-9


                    *సుభాషితం* 


"కాలః పచతి భూతాని

  కాలం సంహరతే ప్రజాః |

  కాలః సుప్తేషు జాగర్తి

  కాలోహి దురితక్రమః"||


                        *భావం* 


కాలమే సకల ప్రాణులను సృష్టిస్తుంది, కాలమే సర్వప్రాణులను సంహరి‌స్తుంది.లీనమై నిదురించిన కాలమే తిరిగి మేల్కొంటుంది,సృష్ఠిక్రమాన్ని ప్రారంభిస్తుంది.అందుకే కాలదర్మాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు.

       విత్తు మొలకెత్తటానికి, మొక్క చిగురించటానికి, చిగురించిన మొక్క మొగ్గ తొడగటానికి, మొగ్గ పుష్పంలా వికసించటానికి, పువ్వు కాయలా మారటానికి,కాయ పండుగా మారటానికి కాలమే కారణం.

      కాలం మహా వేగవంతమైనది. దానికి పురోగమనమే గాని, తిరోగమనం లేదు.


                    *అమృతవచనం* 


*మాననీయ*దత్తోపంత్*ఠేంగ్డీ** జీ (1920-2004) స్వదేశీ జాగరణ మంచ్, భారతీయ మజ్దూర్ సంఘ్ మరియు  భారతీయ కిసాన్ సంఘ్ సంస్థల  వ్యవస్థాపకులు) ఇలా అన్నారు:

 *అనుశాసనం* గురించి వారు మాట్లాడుతూ చాలామంది నిర్భంధం ద్వారా అనుశాసనం ఏర్పడుతుందని భావిస్తారు.కాని సంఘంలో పై స్థాయి అధికారులు స్వయంగా అనుశాసనాన్ని పాటిస్తూ, తమ స్వీయ ఉదాహరణ ద్వారా అందరిలోనూ అనుశాసనబద్ధతను నిర్మాణం చేస్తూ వచ్చారు.దీనినే ఠేంగ్డే జీ *పారివారిక* *అనుశాసనం* అన్నారు.సంఘంలో స్వయం ప్రేరణతోనే అనుశాసనం పాటించబడుతుంది."సమాజ సంఘటన,రాష్ఠ్రీయ పునర్నిర్మాణం అనే మన ధ్యేయాన్ని సాధించడానికి సంఘ కార్యపద్ధతి స్వయం పూర్ణమైనదని మన విశ్వాసం.దానికి పరిపూరకమైన మరొక కార్యపద్దతి ఏదీ అవసరం లేదు.దానికి ప్రత్యామ్నాయం కూడా లేదు.


                  శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి


.

కామెంట్‌లు లేవు: