24, నవంబర్ 2023, శుక్రవారం

సౌందర్యలహరి

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 86*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


  *మృషా కృత్వా గోత్ర స్ఖలన మథ  వైలక్ష్యనమితం*

  *లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే |*

    *చిరా దంత శ్శల్యం దహనకృత మున్మూలతవతా*

  *తులాకోటి క్వాణైః కిలికిలిత మీశానరిపుణా ‖*



మృషా కృత్వా గోత్రస్ఖలనమ్ = (ప్రణయ సల్లాపములలో) ఉన్నట్టుండి, పొరపాటున నీ సవతి పేరును పలికి, 


అథ వైలక్ష్యనమితం భర్తారం = తరువాత అమితమైన తడబాటుతో కళవళబడిన నీ భర్తను, 


లలాటే చరణకమలే తాడయతి తే = ఆయన లలాటముపై నీ మృదువైన పాద కమలముతో తాడనం చేయగా, 


చిరాదంత శ్శల్యం దహనకృతమున్మూలతవతా = శివుని త్రినేత్రముచే దహింపబడి, చిరకాలముగా దుఃఖిస్తున్న 


ఈశాన రిపుణా = ఈశ్వరుని శత్రువైన మన్మధుడు,


 తులాకోటి క్వాణైః కిలికిలితమ్ = అతడు చేసిన కిలకిలారావములు, శివుని లలాటముపై నీ పాదముంచినప్పుడు కలిగిన నీ పాదమంజీరముల కింకిణీ ధ్వనులవలె నున్నది. 


క్రిందటి శ్లోకములో చెప్పుకున్నాము కదూ, పార్వతీదేవి అశోక వృక్షమును తన పాదముతో తాడనము చేయగా శివునకు అసూయ కలిగిందని. ఇప్పుడు ఆయన ఎలాగైనా ఆమె పాదస్పర్శను పొందాలనే కోరికతో, కావాలనే పార్వతీదేవి వద్ద గంగ పేరు ఎత్తాడనీ, ఆ మిషతో తన ఈప్సితం నెరవేర్చుకున్నాడనీ, శంకరుల చమత్కార కవనం ఇది. 

నిజానికి వారిద్దరూ ఒకటే. *శివశక్త్యైకరూపిణీ* అని లలితా సహస్ర నామములలో అన్నారు కదా! ఆమె శివా. శివప్రియ కూడా. వారిద్దరినీ విడిగా ఆరాధించటం సగుణరూపారాధనే అవుతుంది. వారిద్దరూ నిజంగా విడిపోతే ఈ ప్రపంచమే అంతమవుతుంది. వారిద్దరి సమరస, సమన్వయ సంబంధము గురించి *సౌందర్యలహరి 34 వ శ్లోకంలో ఇంతకు పూర్వం చెప్పుకున్నాము*.


*ఈ 86 వ శ్లోకము లలితా సహస్ర నామములలోని 20 వ శ్లోకమును స్మరింపజేస్తుంది*.


*శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా |*

*మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః ‖*



           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: