29, సెప్టెంబర్ 2022, గురువారం

దీర్ఘతమ మహర్షి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*మన మహర్షుల చరిత్రలు...*


*🌹ఈ రోజు 38,వ దీర్ఘతమ మహర్షి గురించి తెలుసుకుందాము.🌹*


🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️


🌿ఈ మహర్షి ఉతథ్య మహర్షికి మమతకి పుట్టినవాడు. బృహస్పతి ఇతని తమ్ముడు. 


🌸ఉతథ్యుడికి ఎప్పుడూ తపస్సు చేయడం, తీర్థయాత్రలు చేయడం, అంటే చాలా ఇష్టం.


🌿గొప్ప జ్ఞానవంతుడై వుండేవాడు.  దేవతల గురువు బృహస్పతి ఈ మహర్షికి సోదరుడున్న మాట.


🌸ఉతథ్యుడి భార్య మమత గర్భవతిగా వున్న రోజుల్లో బృహస్పతి తన సోదరుణ్ణి చూడ్డానికి వచ్చాడు.


🌿మమత అతనికి అతిథి సత్కారాలు చేసింది.  శాపగ్రస్థుడైన బృహస్పతి అన్న భార్య అని కూడ చూడకుండా ఆమెని బలవంతం చేశాడు .


🌸మమత కడుపులో వున్న పిల్లవాడు బృహస్పతిని అవమానించాడు.  బృహస్పతి ఆపిల్లవాణ్ణి గుడ్డివాడుగా పుట్టమని శపించాడు. 


🌿అలా పుట్టు గుడ్డివాడిగా పుట్టిన వాడే మన దీర్ఘతమ మహర్షి.  దీర్ఘతముడు గ్రుడ్డివాడుగా పుట్టినా వేదవేదాంగాలు చదివి విజ్ఞానవేత్త , కీర్తిగలవాడు, తపశ్శాలి అయ్యాడు .


🌸తండ్రి దీర్ఘతముడికి ప్రద్వేషిణిని ఇచ్చి పెళ్ళి చేశాడు.  పేరుకి తగ్గట్టే ప్రద్వేషిణి అందర్నీ ద్వేషించడంలో గొప్పది.


🌿దీర్ఘతముడికి ప్రద్వేషిణి యందు చాలా మంది కొడుకులు పుట్టారు . ఒకసారి దీర్ఘతముడు ఒక్కడూ తపస్సు చేసుకుంటూ వున్నాడు. 


🌸అక్కడికి కామధేనువు కొడుకు వచ్చి దీర్ఘతముణ్ణి నువ్వు గ్రుడ్డివాడివైనా శక్తిమంతుడివి. 


🌿నీకు నేను పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని పుట్టించగల విద్యని నేర్పిస్తాను. 


🌸దీనివల్ల వంశనాశనం అయిపోతున్న వాళ్ళ వంశం నిలబెట్టినవాడ వవుతావని చెప్పి ఆ విద్యని దీర్ఘతముడికి నేర్పించాడు. 


🌿ఈ విద్య ఎలా పనిచేస్తుందో చూద్దామని భార్యని సహకరించమంటే తిట్టింది. 


🌸అది ఆవిడ జన్మ హక్కు కదా. సరే ఈ విద్యని పరీక్షించుకోవాలి కదా పిల్లలులేని వాళ్ళ దగ్గరకి వెళ్ళి తాను నేర్చుకున్నది పనిచేస్తోందని నిరూపించుకున్నాడు. 


🌿తన భర్త అందరితో తిరుగుతున్నాడనుకుని ప్రద్వేషిణి అసహ్యించుకుని ఇంట్లోంచి పొమ్మంది.


🌸విషయం తెలుసుకోకుండా భర్తనని చూడకుండా నన్నవమానించావు కాబట్టి ఇక మీదట ప్రతిస్త్రీకి జీవితాంతం ఒక్క భర్తె ఉండాలి. 


🌿వాడు ఉన్నా, చచ్చిపోయినా ఇంకొకణ్ణి పెళ్ళి చేసుకోకూడదు.   అలా చేస్తే ఆమెకి అపకీర్తి, నింద వస్తాయని శపించాడు దీర్ఘతముడు.


🌸ప్రద్వేషిణి పిల్లల్ని పిలిచి మీ తండ్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు, తీసుకువెళ్ళి గంగలో పడెయ్యమంది.


🌿పిల్లలు అలాగే చేశారు.   దీర్ఘతముడు కాళ్ళు చేతులు కట్టేసి బుట్టలో గంగా నదిలో పడేసినా దాంట్లోనే వేదాలు వల్లె వేసుకుంటున్నాడు.


🌸అలలు ఎటువైపు వెడితే అటువైపు ఆ బుట్ట కొట్టుకుపోతోంది.  కొన్నాళ్ళ తర్వాత బలి అనే మహారాజు గంగాభిషేకం చేద్దామని వచ్చి, 


🌿నదిలో కొట్టుకువస్తున్న దీర్ఘతముణ్ణి చూసి ఇంటికి తీసుకెళ్ళి అతని గురించి మొత్తం తెలుసుకుని, అంతటి మహర్షిని చూడగల్గినందుకు ఎంతో సంతోషించాడు.  


🌸దీర్ఘతముణ్ణి రాజసౌధానికి తీసికెళ్ళి సపర్యలు చేసి బలిమహారాజు తనకి పిల్లలు లేరని పిల్లలు కలిగేటట్లు చూడమని ప్రార్థించాడు. 


🌿తన భార్య సుధేష్ణని మహర్షి దగ్గరకు వెళ్ళమన్నాడు.  కాని సుధేష్ణ ఆ మహర్షి రూపం చూసి అసహ్యించుకుని పనిమనిషిని పంపింది.  


🌸ఆపనిమనిషికి పదకొండుమంది కొడుకులు పుట్టారు. ఆ పదకొండుమంది తన పిల్లలే అనుకుని


🌿 బలిరాజు ఆ పిల్లలకి వేదం నేర్పించాలని దీర్ఘతముడి దగ్గరకు తీసుకువచ్చాడు.  


🌸మహర్షి ఈ పిల్లలు సుధేష్ణకు పుట్టిన వాళ్ళు కాదని పనిమనిషి పిల్లలని చెప్పాడు.  బలి బాధపడి మళ్ళీ సుధేష్ణని మహర్షి దగ్గరకి పంపాడు.  


🌿సుధేష్ణ వలన బలిమహారాజుకి అయిదుగురు కొడుకులు పుట్టారు.   వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి అంగదేశం, కళింగదేశం, వంగదేశం, పుండ్రము, సుహ్మము అనే | రాజ్యాలు పాలించారు. 


🌸ఈ రకంగా దీర్ఘతమ మహర్షి చాలా రాజవంశాల్ని నిలబెట్టాడు.  

దీర్ఘతమ మహర్షి ఋగ్వేదంలో తన తాత్విక శ్లోకాల ద్వారా చాలా బాగా ప్రసిద్ధుడు. 


🌿ఋగ్వేదం సంహితలోని మొదటి మండలం లోని 140 నుండి 164 వరకు గల సూక్తము (శ్లోకాలు) లకు ఇతను రచయిత,


🍂ఋగ్వేదం ఆరవ మండల యొక్క ప్రవక్త అయిన ఋషి భరద్వాజుడు, సోదరుడుగా భావిస్తారు...


🍃ఇదండీ మహర్షి గురించి మనం తెలుసుకున్న విషయాలు రేపు మరెన్నో విశేషలతో మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..


*సేకరణ:* కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 


🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

కామెంట్‌లు లేవు: