🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ధర్మ సందేహాలు*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*పంచకోశాలు అంటే ఏమిటి?*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఉల్లిపాయ ఎలా పొరలు పొరలుగా ఆచ్చాదింపబడి ఉంటుందో అలాగే ఆత్మ చుట్టూ పంచకోశాలు అనే పొరలు చేత కప్పబడి ఉంటుంది.*
*అవి ఆత్మకు తెలుసుకోనియక, పైనున్న పొరలతో ఆత్మ తాదాత్మ్యం చెంది ఆ కోశములనే తానుగా భావించి దుఖములకు లోనగుచున్నది.*
*ఈ ఆత్మ మానవుడి యందు అయిదు కోశాలచేత ఆవరించబడి ఉంటుంది, అవి...*
*1. శరీరం "అన్నమయ కోశం"*
*2. జీవశక్తులచేత ఏర్పడిన "ప్రాణమయ కోశం"*
*3. మనస్సు "మనోమయ కోశం"*
*4. బుద్ధి "విజ్ఞాన మయ కోశం"*
*5. అజ్ఞానంచేత ఏర్పడిన "ఆనందమయ కోశం"*
*పైన చెప్పిన అయిదు కోశములే మనయందు మూడు శరీరాలుగా వ్యవహరింపబడుచున్నవి.*
*1. స్థూల శరీరం- అనగా అన్నమయ కోశం,*
*2. సూక్ష్మశరీరం అనగా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు.*
*3. కారణ శరీరం- అనగా ఆనందమయ కోశం.*
*మానవుడు జీవించి వున్నపుడు ఆత్మ (జీవాత్మ) కారణ శరీరంలోనూ, కారణ శరీరం సూక్ష్మ శరీరంలోనూ, సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోనూ నిబిడమైయున్నందున ఆత్మ మూడు శరీరాలలోను యున్నదని అర్థమవుతోంది.*
*అయితే మరణమనగా ఏమిటి అని విచారించినపుడు స్థూల శరీరం నుండి సూక్ష్మ, కారణ శరీరాలు వేరుకావడమే.*
*తిరిగి జన్మాంతర ప్రాప్తికి సూక్ష్మశరీరమే కారణమవుతున్నది. అంటే మరణం తరువాత జీవాత్మ ప్రాణం వద్దకు అనగా సూక్ష్మ శరీరంలోని ప్రాణమయకోశం వద్దకు మరణ సమయంలో ఏ మనోభావంతో వుంటుందో అదే మనోభావంతో వస్తుందని ఉపనిషద్వువాచ.*
*ఆ విధంగా ఆత్మ(జీవాత్మ) తనకు తగినపుడు పునర్జన్మను పొందుతోంది. మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. జననం మరణానికి ప్రారంభమే తప్ప మరేమి కాదు. పునర్జన్మ లేదంటే తిరిగి మరణించవలసిన అవరంలేదని అర్థం. ఈ విధంగా ప్రాణం యొక్క రాకపోకలను ''పునరపి జననం పునరపి మరణం - పునరపి జననీ జఠరే శయనం''* *అంతఃప్రకృతిని - సత్యం తెలుసుకొన్న ప్రాజ్ఞుడు పునరావృత్తి రహిత కైవల్యాన్ని పొందుతున్నాడని ఉపనిషద్ద్వచనం.*
*కొందరు పెద్దలు మానవ శరీరము సప్తకోశ నిర్మితమని చెప్పియున్నారు. ఇట్టి సప్తకోశములను ఒకదానియందు మరియొకటి అయస్కాంత క్షేత్రమందు అయస్కాంతమున్నట్లు అమర్చబడినవని చెప్పియున్నారు.*
*అన్నమయ కోశమునే భౌతిక దేహముగా కొందరు చెప్పియున్నారు. జ్ఞానమయ విజ్ఞానమయ కోశములను విజ్ఞానమయ కోశముగా చెప్పిరి. ఏ విధముగా చెప్పినను 'నేను' అను జీవప్రజ్ఞ ఈ కోశముల యందు మేల్కొనినప్పుడు ఆయా కోశములకనుగుణముగా ప్రతి స్పందించుచుండును. ఆవేశమునకు ఆనందమునకు లోనైనప్పుడు ఆనందమయ కోశమునందున్న వాడిగాను వ్యక్తమగుచున్నాడు. జీవప్రజ్ఞ ఏ కోశమునందు ప్రధానముగా మేల్కొనియుండునో ఆ కోశమే మిగిలిన కోశములపై ఆధిపత్యము కలిగియుండును.*
*గం గం గం గం గణేశాయ నమః।*
*ఓం నమో భగవతే వాసుదేవాయ।*
*ఓం నమః శివాయ।*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి