19, అక్టోబర్ 2020, సోమవారం

నవరాత్రులు

 **దేవీ నవరాత్రులు*  


3.మూడవరోజు


 అమ్మవారి అలంకారము.


శ్రీ గాయత్రీ దేవి.


**ముక్తా విద్రుమ హేమనీల**

**ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణై:**

**యుక్తామిందు నిబద్ధరత్న**

**మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్!**

**గాయత్రీం వరదాభయాంకుశమ్*

**కశాశ్శుభ్రం కపాలం గదాం**

**శంఖం చక్రమధారవింద యుగళం** **హసైర్వాహంతీం భజే**


సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం , చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. "ఓం భూర్భావస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి దియో యోన: ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి.


 అమ్మవారికి అల్లపు గారెలు నివేదన చేయాలి. గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.


నైవేద్యం - అల్లం గారెలు,రవ్వకేసరి,పులిహోర.


శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి


ఓం శ్రీ గాయత్రై నమః

ఓం జగన్మాత్రే నమః

ఓం పరబ్రహ్మస్వరూపిణే నమః

పరమార్ధప్రదాయై నమః

ఓం జప్యాయై నమః

ఓం బ్రహ్మతేజో నమః

ఓం బ్రహ్మస్త్రరూపిణ్యై నమః

ఓం భవ్యాయై నమః

ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః

ఓం త్రిమూర్తిరూపాయై నమః

ఓం సర్వజ్ఞాయై నమః

ఓం వేదమాతాయై నమః

ఓం మనోన్మవ్యై నమః

ఓం బాలికాయై / వృద్దాయై నమః

సూర్యమండలవసిన్యై నమః

ఓం మందేహదానవధ్వంసకారిణ్యై నమః

ఓం సర్వకారణాయై నమః

ఓం హంసరూఢాయై నమః

ఓం వృషారూఢాయై నమః

ఓం గరుడారోహిణ్యై నమః

ఓం శుభాయై / షట్కుక్షిణ్యై నమః

ఓం త్రిపదాయై / శుద్దాయై నమః

ఓం పంచశీర్షాయై నమః

ఓం త్రిలోచనాయై నమః

ఓం త్రివేదరూపాయై నమః

ఓం త్రివిధాయై నమః

ఓం త్రివర్గఫలదాయిన్యై నమః

ఓం దశహస్తాయై నమః

ఓం చంద్రవర్ణాయై నమః

ఓం విశ్వామిత్రవరప్రదాయై నమః

ఓం దశాయుధధరాయై నమః

ఓం నిత్యాయై నమః

ఓం సంతుష్టాయై నమః

ఓం బ్రహ్మపూజితాయై నమః

ఓం ఆదిశక్తై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం సుషుమ్నాభాయై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః

ఓం సావిత్ర్యై నమః

ఓం సత్యవత్సలాయై నమః

ఓం సంధ్యాయై / రాత్ర్యై నమః

ఓం సంధ్యారాత్రి ప్రభాతఖాయై నమః

ఓం సంఖ్యాయనకులోద్బవాయై నమః

ఓం సర్వేశ్వర్యై నమః

ఓం సర్వవిద్యాయై నమః

ఓం సర్వమంత్రాద్యై నమః

ఓం అవ్యయాయై నమః

ఓం శుద్దవస్త్రాయై నమః

ఓం శుద్దవిద్యాయై నమః

ఓం శుక్లమాల్యానులేపనాయై నమః

ఓం సురసింధుసమాయై నమః

ఓం సౌమ్యాయై నమః

ఓం బ్రహ్మలోకనివాసిన్యై నమః

ఓం ప్రణవప్రతిపాద్యర్భాయై నమః

ఓం ప్రణతోద్దరణక్షమాయై నమః

ఓం జలాంజలిసుసంతుష్టాయై నమః

ఓం జలగర్భాయై నమః

ఓం జలప్రియాయై నమః

ఓం స్వాహాయై / స్వధాయై నమః

ఓం సుధాసంస్థాయై నమః

ఓం శ్రౌషడ్వౌషటడ్వషట్క్రియాయై నమః

ఓం సురభ్యై నమః

ఓం షోడశకలాయై నమః

ఓం మునిబృందనిషేవితాయై నమః

ఓం యజ్ఞప్రియాయ నమః

ఓం యజ్ఞమూర్త్యై నమః

ఓం స్రుక్ స్రువాజ్యస్వరూపిణ్యై నమః

ఓం అక్షమాలాధరయై నమః

ఓం అక్షమాలాసంస్థాయై నమః

ఓం అక్షరాకృత్యై నమః

ఓం మధుచ్చందదఋషిప్రీతాయై నమః

ఓం స్వచ్చందాయై నమః

ఓం చందసాంనిద్యై నమః

ఓం అంగుళీపర్వసంస్థాయై నమః

ఓం చతుర్వింశతిముద్రికాయై నమః

ఓం బ్రహ్మమూర్త్యై నమః

ఓం రుద్రశిఖాయై నమః

ఓం సహస్రపరమాయై నమః

ఓం అంబికాయై నమః

ఓం విష్ణుహృదయాయై నమః

ఓం అగ్నిముఖాయై నమః

ఓం శతమాధ్యాయై నమః

ఓం శతవరాయై నమః

ఓం సహస్రదళపద్మస్థాయై నమః

ఓం హంసరూపాయై నమః

ఓం నిరంజనాయై నమః

ఓం చరాచరస్థాయై నమః

ఓం చతురాయై నమః

ఓం సూర్యకోటిసమప్రభాయై నమః

ఓం పంచవర్ణముఖీయై నమః

ఓం ధాత్రీయై నమః

ఓం చంద్రకోటిశుచిస్మితాయై నమః

ఓం మహామాయాయై నమః

ఓం విచిత్రాంగ్యై నమః

ఓం మాయాబీజనివాసిన్యై నమః

ఓం సర్వయంత్రాత్మికాయై నమః

ఓం జగద్దితాయై / రాత్ర్యై నమః

ఓం మర్యాదాపాలికాయై నమః

ఓం మాన్యాయై నమః

ఓం మహామంత్రఫలప్రదాయై నమః

ఓం సర్వతంత్రస్వరూపాయై నమః 


🌹శ్రీ మాత్రే నమః🌹

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: