19, అక్టోబర్ 2020, సోమవారం

ధార్మికగీత - 54*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        *ధార్మికగీత - 54*

                                *****

       *శ్లో:- అన్నం దానాత్పరం దానం ౹*

               *విద్యాదాన మతః పరం ౹*

               *అన్నేన క్షణికా తృప్తిః ౹*

               *యావజ్జీవం చ విద్యయా ౹౹*

                        *****

*భా:- మన సాంప్రదాయ కర్మాచరణవిధులలో షోడశ దానాలు ప్రధానమైనవి. అందులో అన్ని దానాల కన్న "అన్నదానం" మిన్నగా చెబుతారు. సృష్టిలో సకల జీవాలు అన్నము వలననే మనుగడ సాగిస్తున్నాయి. అందుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావింపబడుచున్నది. కొన్ని దేవస్థానాలలో నిరతాన్న దానాలు నేటికీ జరగడం దాని ప్రాముఖ్యాన్ని చాటుతోంది. కాని అన్నదానం వల్ల కలిగే ఆనందం క్షణకాలికమే. "అన్నదాతా సుఖీభవ" అనే శుభకామనతో పరిసమాప్తమవుతున్నది. కాన అన్నదానం కన్న "విద్యాదాన"మే మిన్న. అన్నం వల్ల తాత్కాలిక ఆనందం పొందితే, విద్య వల్ల జీవితపర్యంతం పరమానందాన్ని అనుభవింపగలడు. "విద్య" ఇహ, పర సుఖ,భోగభాగ్య ప్రదాయిని. జ్ఞాన దాయిని. "జ్ఞానే నైవ తు కైవల్యం" - ఆ జ్ఞానము మోక్షఫలదాయియై నరజన్మను సార్థకం చేస్తుంది. వివేకానందుడు "ముందు పేదవాని కాలే కడుపుకి ఇంత అన్నంపెట్టి, తరువాతనే బోధ చెయ్యండి" అనడంలో ఔచిత్యం గ్రహించాలి*.  

                                     *****

                    *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: