19, అక్టోబర్ 2020, సోమవారం

ధనిష్ఠ నక్షత్రము

 ధనిష్ఠ నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు


నక్షత్రములలో ధనిష్ఠ 23వ నక్షత్రము. ధనిష్ఠా నక్షత్ర అధిపతి కుజుడు, ఇది రాక్షస గణము, పురుష జాతి, రాశ్యాధిపతి శని, జంతువు సింహము. 


ధనిష్ఠ నక్షత్రము మొదటి పాదము  

ధనిష్ఠ నక్షత్ర అధిపతి కుజుడు. ఈ జాతకుల మీద సూర్య కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రము. కనుక వీరు ఏదైనా కార్యము యందు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. వీరికి ఆవేశం పాలు అధికమే. వీరికి యునియన్ నాయకులుగా ఉండే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, అతిశయం అధికంగా ఉంటాయి. వీరికి తండ్రితో అనుబంధం కాస్త అధికంగానే ఉంటుంది. సైనికపరమైన, విద్యుత్ సంబంధిత, అగ్ని సంబంధిత, భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 


వీరికి ఆరు సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. విద్యలో అడ్డంకులు ఎదురు కావచ్చు. వీరికి రాహు దశ కాలం తల్లిదండ్రుల నీడలో జరిగి పోతుంది కనుక కష్టం తెలియకుండా గడిచిపోతుంది. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. 24 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు కాస్త తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయాల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 40 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. 59 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.


ధనిష్ఠ నక్షత్రము రెండవ పాదము

  ఈ జాతకులకు ఆవేశం, బుద్ధి కుశలత అధికంగా ఉంటుంది. వ్యాపారం చేయడమంటే అంటే ఆసక్తి కనబరుస్తారు. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం. సైనిక పరమైన వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం. 


ఈ నక్షత్ర జాతకులకు నాలుగు సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి. వీరికి రాహు దశ కాలంలో తల్లిదండ్రుల నీడలో జరిగిపోతుంది కనుక అప్పుడు కష్టాలు తెలియకుండా జరిగిపోతుంది. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. 22 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు క్రమంగా తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఆర్థిక సమస్యలు వస్తాయి. 38 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులే అధికమవుతాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కాస్త ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సుఖంగా సాగిపోతుంది.


ధనిష్ఠ నక్షత్రము మూడవ పాదము   

వీరికి పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఆవేశమూ అధికమే. వీరు పరిశుభ్రమైన వాతావరణంలో నివసించడానికి ఆసక్తులై ఉంటారు. వీరు కళాత్మకమైన వస్తు సేకరణ చేయడానికి ఆసక్తులై ఉంటారు. వీరికి జల విద్యుత్, జల, భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం అనుకూలిస్తుంది. సైనిక సంబంధిత, కళా సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 


ఈ జాతకులకు రెండు సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి. రాహుదశ కాలం తల్లిదండ్రుల నీడలో జరిగిపోవడం వల్ల వీరికి కష్టం తెలియకుండా జరిగిపోతుంది. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం. 20 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవాల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు తప్పవు. 36 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. 55 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 72 సంవత్సరాల కాలంలో వచ్చే కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటన, తీర్ధ యాత్రలు అనుకూలిస్తాయి. మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది.


ధనిష్ఠ నక్షత్రము నాలుగవ పాదము

వీరి మీద పరిపూర్ణ కుజ ప్రభావం ఉంటుంది. ఈ జాతకులకు ధైర్యసాహసాలు, ఆవేశం అధికంగా ఉంటాయి. ప్రజా ఉద్యమాలలో వీరు ముందుంటారు. వీరికి సైనిక సంబంధమైన ఉద్యోగాలు, ధైర్య సహసాలు అవసరమైన ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 


ఈ జాతకులకు ఒక సంవత్సరమువరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం. రాహు దశ కాలంలో తల్లిదండ్రుల నీడలో ఉంటారు కనుక కష్టాలు లేకుండా జరిగిపోతుంది. 19 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. అయితే సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 35 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 54 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.


ధనిష్ఠా నక్షత్రము ఫలితాలు


ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి బుద్ధికుశలత కలిగి ఉంటారు. వీరి సరైన తెలివితేటలను ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. చదువు, సంస్కారం ఉపయోగపడే మంచి అధికారిగా రాణిస్తారు. అయితే వీరి అధికార వైఖరి, మొండితనం వల్ల ఇతరుల నుంచి విమర్శలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఎదురవుతుంది. 


అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. సొమ్ము పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కాని అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు. స్థిరాస్థుల రుపంలోనే నిలబడతాయి. మేధావులుగా భావిస్తారు కాని ఆత్మీయులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలిగిస్తాయి. దుష్టులకు భాగస్వామ్యం అప్పచెబుతారు. అందువలన నష్టపోతారు. అనవసర వ్యక్తులను నెత్తికి ఎక్కించుకుని అందలం ఎక్కించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. 


ఈ జాతకులకు గురు, శని, బుధ, మహర్ధశలు, శుక్రదశ యోగిస్తాయి. వీరు జమ్మిచెట్టును పెంచడం, పూజించడం వల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. అలాగే వీరికి తెలివితేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కామెంట్‌లు లేవు: