3, డిసెంబర్ 2024, మంగళవారం

అవధానవిద్య నఱయగ

 అవధానవిద్య నఱయగ 

వ్యవధానములేక సాగు నవధానమ్ముల్ 

అవధానియె సర్వాధిపు 

డవధానియె చక్రవర్తి యావేదికపై 


అవధాని ననుసరింపగ 

వ్యవధానము కోరి జూతు రాపృచ్ఛకులున్ 

అవధానవిద్య యంతయు 

సవరించిన భూషణమ్ము నా వాణికినౌ 


సారస్వత విన్యాసము 

పారీణత పెల్లుబుకెడు పాండిత్యమునౌ 

ధీరత నిండిన సరసత 

భూరిగ పండించు హాస్య ఫుల్లాబ్జములున్ 


వేదికపై పండితకవు 

లాదరమొప్పంగ వాణి నందుకొనంగన్ 

మోదముతో ప్రేక్షకులును 

స్వేదము చిందించుచుండ్రు చిఱునగవులతో 

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: