చ.కలియుగ లీల లేమొ యివి కాలుడు గారడి సేయు చుండె విం
తలు గన మానసమ్మునకు తాలిమి లే దిసుమంత యైన నీ
కలుషిత భావ జాలము వికారములన్ సృజియింప మానవుల్
తలపగ లేరు వారి భవితవ్యము నెంచ గనంగ భారతీ!౹౹ 63
ఉ.పారము పొందఁ జాలక నవాంఛిత రీతి నరాచకమ్ములన్
భూరి దిగంతరాళములఁ బూని వినాశనముల్ సృజించుచున్
ఘోర ఖలీకృతుల్ సలుపు కూళుల నీవు సహించుటేల? వి
స్ఫారిత లోచనాభ్యుదయ! వైభవ పూర్ణ! విశాల భారతీ!౹౹ 64
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి