*2050*
*కం*
ఇతరులొనరు సుకృతంబుల
నతిగా దోషములనెంచు నలతుల కన్నన్
మితముగనైనను సాయము
మతిభక్తితొ జేయువారె మాన్యులు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఇతరులు చేసే మంచిపనుల యందు అతిగా తప్పులను ఎంచిచూపే అల్పులకన్నా ఎంతో కొంత అయినా సహకారం మనస్పూర్తిగా చేసేవారే గొప్పవారు.
*సందేశం*:-- ఒకమంచిపని ఇతరులు చేసేటప్పుడు అందులో ని తప్పు లు కనబడటం చాలా సహజం, కానీ ఆ తప్పులను ఎంచిచూపడంకన్నా తనవంతు సహాయం చేసే వాడే గొప్పవాడు కాగలడు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి