తిరుపతి జిల్లా..
*తిరుపతి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసు వారి విజ్ఞప్తి..*
*సైబర్ నేరాల పట్ల జాగ్రత్త*
*సైబర్ నేరాల స్టైలే వేరు*
*రూటు మార్చిన సైబర్* *కేటుగాళ్లు*
మీ పేరు పైన గానీ లేదా మీ కుమారుడు/కుమార్తె పేరు పైన గాని ఒక పార్సెల్ వచ్చిందని, అందులో ఒక లాప్టాప్ మరియు మాదక ద్రవ్యాలకు సంబంధించిన కొకైన్, డ్రగ్స్ ఉన్నట్లుగా గుర్తించామని ముంబై కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ యూనిఫామ్ ధరించిన ఒక అపరిచిత వ్యక్తి నుంచి మీకు వీడియో కాల్ గాని లేదా నార్మల్ కాల్ గాని చేసి మిమ్మల్ని భయపెడతారు..
వెంటనే ఈ కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పిన అకౌంట్ కి Rs.50,000/- ట్రాన్స్ఫర్ చేయాలని, ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి మీ అకౌంట్ కి పంపిస్తామని చెప్పి మభ్యపెడతారు..
ఇలాంటి అపరిచిత కాల్స్ వచ్చినప్పుడు వెంటనే నేను ఎటువంటి ఆర్డర్స్ పెట్టలేదని చెప్పి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేస్తానని కాల్ కట్ చేసి, ఆ ఫోన్ నంబర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలి..
అపరిచిత కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత పిన్ నెంబర్ మరియు ఓటీపీలను షేర్ చేయకుండా ఉండాలని జిల్లా ఎస్పీ. శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్ , గారు విజ్ఞప్తి చేశారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి