ॐ मुकुन्दमाला स्तोत्रम्
ముకుందమాల స్తోత్రమ్
Mukunda Mala Stotram
శ్లోకం : 16
SLOKAM : 16
जिह्वे कीर्तय केशवं, मुररिपुं
चेतो भज श्रीधरं
पाणिद्वन्द्व समर्चयाच्युतकथाः
श्रोत्रद्वय त्वं शृणु I
कृष्णं लोकय लोचनद्वय
हरेर्गच्छाङ्घ्रि युग्मालयं
जिघ्र घ्राण मुकुन्दपादतुलसीं मूर्धन्
नमाधोक्षजम् ॥ १६ ॥
జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం
చేతో భజ శ్రీధరం
పాణిద్వంద్వ సమర్చయాచ్యుతకథా:
శ్రోత్రద్వయ త్వం శృణు
కృష్ణం లోకయ లోచనద్వయ
హరేర్గచ్చాంఘ్రియు గ్మాలయం
జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీం
మూర్ధన్న మాధోక్షజంll
ఇంద్రియ నిగ్రహం రెండు రకాలు. చేయకూడని వాని నుండి మరలించుట, చేయ వలసిన వానిని చేయుట.
ఈ శ్లోకమందు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సులచే చేయదగిన వానిని చెప్పుచున్నారు.
ఓ పాద ద్వంద్వమా!
నీవు హరిమందిరమునకు నడుచుచుండుము.
ఓ హస్త ద్వంద్వమా!
నీవు శ్రీధరుని అర్చన చేయుచుండుము.
ఓ వాగింద్రియమా!
నీవు కేశవుని కీర్తింపుచుండుము.
ఓ శిరమా!
నీవు అథోక్షజునికి నమస్కరించు చుండుము.
(ఇట్లు కర్మేంద్రి యములను నిగ్రహింప వలెను.)
ఓ నేత్రద్వంద్వమా!
శ్రీకృష్ణభగవానునే చూడుము.
ఓ శ్రోత్రద్వంద్వమా!
ఆ అచ్యుతుని లీలలనే ఆకర్ణింపుము.
ఓ నాసికా!
ముకుందుని పాదపద్మాలను అలంకరించి ఉన్న తులసిని ఆఘ్రాణించు
(ఇట్లు జ్ఞానేంద్రియములను నిగ్రహింపవలెను.)
ఓ మనసా!
ఆ మురారినే ధ్యానింపుము.(ఈవిధంగా మనస్సును నిగ్రహింపవలెను)
O tongue!
praise the glories of Lord Keśava.
O mind!
worship the enemy of Mura (Murari).
O hands!
serve the Lord of Śrī (Sridhara).
O ears!
hear the topics of Lord Achyuta.
O eyes!
gaze upon Śrī Kṛisṇa.
O feet!
go to the temple of Lord Hari.
O nose!
smell the tulasī buds on Lord Mukunda’s feet.
O head!
bow down to Lord Adhokṣaja.
https://youtu.be/ZTs6tcgm0lE
కొనసాగింపు
=x=x=x=
— రామాయణంశర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి