🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏
🌹#భోళాశంకరుడు🔱🚩
♦️పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం
తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ ”♦️
🌹పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే #అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.
🌹సృష్టిలో తాను చాలా ప్రత్యేకమైన వ్యక్తిననీ, తనంతటి వారు మరేవరూ లేరని అనుకోవడం మనిషి సహజ అహాంకారం.
🌹ఫలోదకాలను మన తెలివితో సంపాదించుకున్నామనే అహంకారాన్ని వదిలి... అవన్నీ భగవంతుడు ప్రసాదిస్తే అనుభవించగలుతున్నామని గుర్తించేందుకు శివాభిషేకం చేయాలి.
🌹అందుకు మనసులో నీవిచ్చిన సంపదతోనే నిన్ను అర్చిస్తున్నామని స్వామికి కృతజ్ఞతను తెలియజేయడం అభిషేకంలో ఉన్న అంతరార్థం.
🌹వినయాన్ని విన్నవించుకోవడం అభిషేకం.
🌹ఎలాగైతే మనం మన శరీరంపై ఉన్న దుమ్ము, ధూళీ, మురికి తొలగించుకోవడానికి స్నానం చేస్తామో...
అలాగే మన అంతరంగంలోని మాలిన్యం ప్రక్షాళన కావడానికి శివుడికి అభిషేకం చేయాలి.
🌹అభిషేక సమయంలో వినిపించే రుద్రాధ్యాయంలోని మంత్రభాగం మనకు కనువిప్పు కలిగిస్తుంది.
సృష్టిలోని సకలప్రాణులు, వృక్షాలు మొదలైనవన్నీ పరమేశ్వర స్వరూపమేననీ, సకల ప్రాణులకూ శుభం కలగాలని మనం అందులో కోరుకుంటున్నట్లుగా శివాభిషేకం చేయాలి.
🌹అభిషేకం చేసే సమయంలో వెలువడే మంత్రాల అర్థాలు మన అంతరంగాన్ని తట్టి మేల్కోల్పుతాయి. అప్పుడు జ్ఞాన జ్యోతి స్వరూపుడైన #పరమశివుడు మనలో ఆవిర్భవిస్తాడు.
♦️శివో అభిషేక ప్రియ:♦️ అంటే...
🌹పరమశివుడు అభిషేక ప్రియుడు.
♦️“నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు”♦️
🌹#తాత్పర్యము
శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు ‘కామధేనువు’ కాడి పశువుగా పడి వుంటుందట.
‘కల్పవృక్షం’ అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట.
🌹శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి. సకల ఐశ్వర్యములు సమకూరతాయి.
ఆవు పాలతో -- సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు -- ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి -- ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార) -- దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె -- తేజో వృద్ధి
భస్మ జలం -- మహా పాప హరణం
సుగంధోదకం -- పుత్ర లాభం
పుష్పోదకం -- భూలాభం
బిల్వ జలం -- భోగ భాగ్యాలు
నువ్వుల నూనె -- అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం -- మహా ఐశ్వర్యం
సువర్ణ జలం -- దరిద్ర నాశనం
అన్నాభిషేకం -- సుఖ జీవనం
ద్రాక్ష రసం -- సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం -- సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం -- శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం) -- ద్రవ్య ప్రాప్తి
ధవళొదకమ్ -- శివ సాన్నిధ్యం
గంగోదకం -- సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం -- చక్రవర్తిత్వం
నేరేడు పండ్ల రసం -- వైరాగ్య ప్రాప్తి
నవరత్న జలం -- ధాన్య గృహ ప్రాప్తి
మామిడి పండు రసం -- దీర్ఘ వ్యాధి నాశనం
పసుపు, కుంకుమ -- మంగళ ప్రదం
విభూది -- కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.
🌹నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు.
అందుకే ఆయన "భోళా శంకరుడు"
🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి