12, నవంబర్ 2020, గురువారం

ముహుర్తం

 ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహుర్తం అంటారు. ఒక పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడానికి నిర్ణయించుకున్న మూహుర్తాన్ని మంచి ముహుర్తం అంటారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలాన్ని అనగా తెల్లవారుజామును మంచి ముహుర్తం అంటారు. అందువలనే తెల్లవారుజామున ప్రారంభించిన పని ఏటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయంటారు. తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు రెండు ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించవలెనని అంటారు. బ్రహ్మ మూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేకమంది నూతన గృహప్రవేశంనకు ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంనందే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణామాయం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయడం చాలా మంచిది.


                      బ్రహ్మ ముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృథా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానకి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిమిషాలు ఏదైనా కీర్తన పాడటం వల్ల మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

కామెంట్‌లు లేవు: