🙏భగవద్గీతలో యోగములు🙏*
☘️🌿☘️🌿☘️🌿☘️🌿☘️భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి "యోగము" అనే పేరు ఉంది.
ఇక్కడ "యోగం" అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్ధంలో, జ్ఞాన బోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది.
*అర్జునవిషాద యోగము* యుద్ధ భూమిలో తాతలు తండ్రులు, సోదరులు, గురువులు, మేనమామలు మొదలైన ఆప్తులను శత్రు సేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జుని కమ్ముకున్న విషాదము గురించిన వర్ణన.
*సాంఖ్య యోగము*
ఆత్మ స్వరూపము గుణగణాల వర్ణన.
*కర్మ యోగము*
కర్మ చేయడంలో నేర్పు, దానిని యోగములా మార్చుకోవడం ఎలా అని చెప్పే యోగము.
*జ్ఞాన యోగము*
నర, నారాయణూల జన్మలు, భగవంతుని జన్మలోని శ్రేష్టమైన గుణాలు.జ్ఞాన సముపార్జన మార్గాల వివరణ.
*కర్మసన్యాస యోగము* కర్మలను ఫలితాలను సన్యసించి భగవంతునికి అర్పించి ఆయన ఇచ్చిన దానిని ప్రసాదంగా స్వీకరించడం ఎలా అన్న వివరణ.
*ఆత్మసంయమ యోగము* ధ్యానము, ఏకాగ్రతల ద్వారా మనోనిగ్రహము సాధించడము, ఆహారనియమాలు, సాధనా ప్రదేశము ఏర్పాటు వర్ణన.యోగి గుణగాణాల వర్ణన, భగవంతుని సర్వవ్యాఇత్వము, యోగభ్రష్టత ఫలితాల వర్ణన.
*జ్ఞానవిజ్ఞాన యోగము* భగవంతుని, ఉనికి, గుణగనాలు, ప్రకృతి, మాయని జయించడము.మోక్షగామి గుణగణాల వర్ణన.
*అక్షరపరబ్రహ్మ యోగము* బ్రహ్మతత్వము, ఆధ్యాతకత, కర్మతత్వము, ఆది దైవతము, ఆది భూతముల వర్ణన.జీవుని జన్మలు, జీవ ఆవిర్భావము, అంతము, పుణ్యలోక ప్రాప్తి, అత్యకాలములో భగవన్నామస్మరణ ఫలం.
*రాజవిద్యారాజగుహ్య యోగము*
మోక్ష ప్రాప్తి వివరణ.భగవతత్వము, స్వర్గలోకప్రాప్తి, దేవతారాధనా వాటిఫలము, భక్తుల గుణగణాల వర్ణన.
*విభూతి యోగము*
భగవంతుని చేరే మార్గము.భగవంతుని విశ్వ వ్యాపికత్వము వర్ణన.
*విశ్వరూపసందర్శన యోగము* :- విశ్వరూపము గురించిన విస్తారమైన వర్ణన.
*భక్తి యోగము* :-
భక్తి యోగ వర్ణన.భగవంతుని ప్రియము పొందలిగిన భక్తుని గుణగణాల వర్ణన.
*క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము* :- ప్రకృతి పురుషులు, క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానము తెలిపేది.
*గుణత్రయవిభాగ యోగము* :- సత్వగుణము, రజోగుణము, తామసగుణము వివరణ, వారి ఆహారవ్యవహారాల వర్ణన.
*పురుషోత్తమప్రాప్తి యోగము* :- భగవంతుని స్వరూపము తత్వము పురుషోత్తముని చేరే మార్గము వివరణ.
*దైవాసురసంపద్విభాగ యోగము* :-
దైవీగుణసంపద, అసురీగుణసంపద కవారి ప్రవృత్తి, ప్రవర్తన ఆలోచనాదుల వర్ణన.
*శ్రద్దాత్రయవిభాగ యోగము:-* సత్వ, రాజసిక, తామసికములనబడే మూడు విధములుగా గుర్తించిన శ్రద్ధలను గురించిన వివరణ.
*మోక్షసన్యాస యోగము* :- మోక్ష ప్రాప్తికి కావలసిన జ్ఞానము, సన్యాసము గురించిన వర్ణన.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి