🙏
*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు
*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్
*ఓం సర్వసమర్దాయనమః*
శ్రీ కాళహస్తి మండలం, కళత్తూరు నివాసి వేణుమలై అనే భక్తుని ప్రాణాపాయ పరిస్థితులలో శ్రీ స్వామివారు రక్షించిన విధం వారిలా వ్రాస్తున్నారు.
శ్రీ స్వామివారితో నాకింతకు ముందు గల కొన్ని అనుభవాలవలన వారు నాజీవితంలో ఆపద్భాంధవుడయ్యారు. 1996 నవంబరునెలలో ఒకరోజు నేను రాళ్ళకళత్తూరు ఏటిలోని కొద్దిపాటి నీటిని దాటి పోతున్నాను. నీటి ప్రవాహం నిమిషాలలో ఎక్కువై నేను నడి ఏటిలో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో దిక్కుతోచక *" స్వామి నన్ను కాపాడు నీవేదిక్కు"* అని పెద్దకేక పెట్టాను. కనుచూపు మేరలో అక్కడెవ్వరూలేరు.
కానీ చిత్రంగా ఒక నడివయస్కుడు వచ్చి. *నారెట్టపట్టుకొని "భయపడవద్దు" అని చెపుతూ నన్ను ఏటి గట్టుకు చేర్చారు.* "నీవు భయపడియున్నావు ఆకాలువ దగ్గరుండే చాకలివారు కాలువకూడా దాటిస్తారు పో" అని చెప్పి నా కళ్ళముందే అదృశ్య మయ్యారు. ఈ అదృశ్యమవడమనేది జరుగకుంటే నాకు వారు శ్రీ స్వామివారేననే విశ్వాసం కలుగదు గదా!. నావిశ్వాసం బలపడేందుకే ఆమహనీయుడు అలాచేసి నాకు ప్రాణబిక్ష పెట్టడమే కాక *నావిశ్వాసాన్ని బలపరిచి వారిని శ్రద్ధాభక్తులతో సేవించేటట్లు చేశారు.*
🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*
*సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*
*టాపిక్ :- 22*
*స్థిత ప్రజ్ఞుడు*
- శ్రీ రామచంద్రరావు
ఒకసారి వార్తాలాపం అనే పుస్తకంపై ఒక కుక్క పడుకొని వుంది. అది చూసి చిరాకేసి “వెధవ కుక్క పుస్తకం పాడు చేస్తున్నది. " అని తిట్టాను “దాన్నెందుకు అలా
ఈ సడించుకుంటావు. నేను చెప్పింది వింటారు గాని ఆచరించరు గదా! అని” అన్నారెంతో బాధగా.
ఆయనను మిమిక్రి చేస్తూ మాట్లాడినా, లేదా సరదాగా మాట్లాడుకుంటున్నా ఆయన సంతోషించేవారే గాని ఏమనేవారు కాదు. ఒకసారి మాస్టర్ గారెళ్ళిం తర్వాత నేను ఏదో లెక్చరిస్తున్నాను. ఇంతలో ఆయన మళ్ళీ వచ్చారు. నేను ఆయన్ను చూసి వెంటనే ఆపాను. అప్పడాయన “నేను రాగానే ఎందుకు ఆపేయటం? నేను వింటానుగా. యిక నుంచి మీరే చెప్పాలి” అన్నారు.
🙏జై సాయిమాస్టర్🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి