*🐄గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🐄*
*నేడు ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవం*
రోజులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి ఈ ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి? జులై 12న దీన్ని ఏటా నిర్వహిస్తున్నారు? పేపర్ బ్యాగులు మనకు అవసరమా? ఇవి పర్యావరణానికి మేలు చేసేవి అని తెలిసి కూడా ప్రజలు ఎందుకు వీటిని వాడలేకపోతున్నారు? పేపర్ బ్యాగుల్ని వాడకపోతే ఏమవుతుంది? ప్రపంచం మునిగిపోతుందా? దేశాలు సముద్రాల్లో కలిసిపోతాయా? జల ప్రళయం వస్తుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం...
మీరు భూకంపం తర్వాత వచ్చే వేగవంతమైన సునామీలను చూసి వుంటారు. ఆ సునామీలు ఒక రోజుతోనే ముగిసిపోతాయి. కానీ పేపర్ బ్యాగ్స్ వాడకపోవడం వల్ల వచ్చే సునామీకి రావడమే గానీ పోవడం తెలియదు. ఎందుకంటే అది నిదానంగా వచ్చే జల ప్రళయం. ప్రపంచాన్ని ముంచేసే మహా ప్రళయం. ఇదెలా సాధ్యమో వాస్తవాలతో తెలుసుకుందాం. దాని కంటే ముందు ఈ పేపర్ బ్యాగుల దినోత్సవం ఎందుకన్నది చూద్దాం. తెల్లారితే మనం ఎక్కువగా వాడేది ప్లాస్టిక్ క్యారీ బ్యాగులే. వాటిని మనం ఇలా వాడి అలా పారేస్తాం. కానీ అది భూమిలో కరిగిపోవడానికి వెయ్యి సంవత్సరాలు (carry bag decompose time) పడుతుంది. ఇలా రోజూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కోట్ల ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులు, వాటర్ బాటిళ్లు వాడి పారేస్తున్నారు. ఇవి అటు తిరిగీ, ఇటు తిరిగీ చివరకు నౌకల్లో సముద్ర గర్భంలోకి వెళ్తున్నాయి. వీటిని రీసైక్లింగ్ చేసే వ్యవస్థలు సరిగా లేవు. అందువల్ల ప్రపంచ దేశాలు రహస్యంగా చెత్తను సముద్రంలో పడేస్తున్నాయి. అలాగే డ్రైనేజీ మురికి కాలువలు కూడా వెళ్లేది సముద్రాల్లోకే. పరిశ్రమల వ్యర్థాలు కూడా చివరకు చేరుతున్నది సముద్రాన్నే. ఇలా అన్నీ సముద్రంలో కలుస్తుంటే.. సముద్ర మట్టాలు పెరగకుండా ఎలా ఉంటాయి? అందుకే జల ప్రళయం సైలెంటుగా వస్తోంది. తీర ప్రాంత నగరాల్ని కబళిస్తోంది. దీనికి చెక్ పెట్టాలంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించి... పేపర్ బ్యాగుల్ని (paper bags) వాడాలన్నది ప్రపంచ దేశాల సందేశం.
*అందుకోసం*
పేపర్ బ్యాగుల్ని... భూమిలో త్వరగా కలిసిపోయే పదార్థాలతో తయారుచేస్తారు. మహా అయితే 3 నెలల్లో అవి భూమిలో కలిసిపోతాయి. మొక్కలకు ఎరువుగా మారిపోతాయి. వాటివల్ల పర్యావరణానికి అంతా మేలే జరుగుతుంది. ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఓ రోజును కేటాయించారు. అదే జులై 12.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి