మంచి శ్లోకం చదువుదాం
--------------------------------
శ్లో::షోడశాబ్దాత్పరం పుత్రం
ద్వాదశాబ్దాత్పరంస్త్రియం
నా తాడయేద్దుష్ట వాక్యైః
పీడయే న్న స్నుషాదికమ్
పదహారేళ్ళు వయసు దాటిన పుత్రులను తిట్టకూడదు.పండ్రెండేళ్ళు దాటిన కూతురి ని కఠినమైన మాటలు మాట్లాడి కూడదు.మనసునొప్పించకూడదు.కోడళ్ళను పరుష పదజాలంతో తిట్టకూడదు.బాధించకూడదు.
కుటుంబ వ్యవస్థ లో చాలా మంది చేస్తున్న పొరపాటు. తల్లి దండ్రులం కన్న వాళ్ళం ఒక మాటంటే ఏమయింది.పడాలి. ఇంత చేస్తున్నాం ఒక దెబ్బ వేస్తే ఏమిటట.అంటారు. అలా అనకూడదు అని ధర్మ శాస్త్రం.ప్రస్తుత కాలంలో చిన్న మాటలకే పౌరుషపడి ఏవేవో నిర్ణయాలు తీసుకోవడం వల్ల చివరికి తల్లి దండ్రులు బాధ పడడం జరుగుతుంది.ఆ వయసు వారికి లాలనతో చెప్పాలి.పదిహేనేళ్ళవయసువరకు ఒక దెబ్బ వేసి చెప్పాలి.ఆవయసు దాటాక పుత్రులను మిత్రులు గా చూడాలంటోంది శాస్త్రం."ప్రాప్తేతు షోడశవర్షే పుత్రం మిత్రవదాచరేత్".
కన్న వారి పట్ల అంత జాగ్రత్తగా ఉండాలి అన్నప్పుడు బయటనుండి వచ్చిన అమ్మాయిని ఇంకెంత జాగ్రత్తగా చూడాలి.అంటే కోడలి పట్ల.
కాలం మారింది ఎప్పటివో ధర్మాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తస్మాత్ జాగ్రత్త 🙏💐
మీ కామేశ్వరరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి