🙏 ప్రతిరోజూఒక్క భగవద్గీత శ్లోకం పారాయణం చేద్దాము, చేయిద్దాము 🙏
🌿భగవద్గీత 1వఅధ్యాయం, అర్జున విషాద యోగం,🌿
-------------------------------------------------
🌻46-వ,శ్లోకం- యది మామప్రతీకార, మశస్త్రం శస్త్రపాణయః|
ధార్తరాష్ట్రా రణేహన్యుస్తన్మే క్షేమతరం భవేత్॥🌻
అర్థం- అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు! ఆయుధములు ధరింపకుండా, ఎవరిని ఎదిరించకుండా ఉన్న నన్ను ఆయుధములు పట్టుకొని ఉన్న దుర్యోధనుడు మొదలైన వారు చంపినా కూడా అది నాకు మరింత క్షేమకరమే అవుతుంది.
---------------------------------------------------
బంధువులను చంపిన పాపము నాకు అంటదు. బంధుమిత్రుల ప్రాణములు దక్కుతాయి. వీళ్లందరినీ కాపాడిన పుణ్యం నాకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని అర్జునుడు భావిస్తున్నాడు.
ఇక ఒకే ఒక్క శ్లోకంతో అర్జున విషాద యోగం పూర్తవుతుంది. అర్జున విషాద యోగంలో అనేక విషయాలు, అనేక ధర్మాలు మనం తెలుసుకున్నాము. ఎల్లుండి నుండి భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ప్రారంభం కాబోతోంది. శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుండి వచ్చినటువంటి గీతామృత ధార ప్రారంభం కాబోతోంది. భక్తిశ్రద్ధలతో చదువుతూ అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకుందాము.
జ్ఞానేనతు కైవల్యం. జ్ఞానం ద్వారానే కైవల్య ప్రాప్తి కలుగుతుంది. రాధే కృష్ణ ,రాధే కృష్ణ ,రాధే కృష్ణ.
------------------------------------------------------------------------------
🙏షేర్ చేసి కొన్ని కోట్లమంది ప్రజలు ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకం అర్థంతో సహా పారాయణను చేసే అదృష్టాన్ని కల్పిద్దాము. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని,ఈ భగవద్గీత పారాయణ మహాయజ్ఞ ఫలితాన్ని అందరం పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిద్దాము. గీతామృతాన్ని అందరం త్రాగి ఆనందిద్దాము, 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి