080322F1701. 090322-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*తలపులకు…*
*తలుపులు వేయాలి!*
➖➖➖✍️
*తాబేలు తనను తాను రక్షించుకోడానికి దాని మీద ఒక ధృఢమైన కవచం లాంటి డిప్ప ఒకటి సహజంగా అమర్చబడి ఉంటుది.*
*తాబేలు తనకు బయట నుండి ఏదైనా ఆపద సంభవిస్తుంది అని అనిపించిపుడు… తన తలను, మిగిలిన అంగములను ఆ డిప్పలోకి లాక్కుంటుంది. అప్పుడు దానికి రక్షణ కలుగుతుంది.*
*అలాగే స్థిత ప్రజ్ఞుడు బయట ప్రపంచంలో ఉన్న విషయవాంఛల నుండి తనను తాను రక్షించుకోడానికి తన ఇంద్రియములను వెనక్కు లాక్కుంటాడు.*
*ఇది అర్థం కావాలంటే మనము ఆచరించ వలసిన సాధనల గురించి ముందు తెలుసుకోవాలి!*
*ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియములను అదుపులో ఉంచుకోవడం.*
*నిగ్రహము అంటే ఇంద్రియములను అణగతొక్కడం అని అర్థం తీసుకోకూడదు.*
*విపరీతంగా ఇంద్రియములతో స్పందించకూడదు. దేహమును అంటే ఇంద్రియములను నియంత్రించాలి.*
*సాధకుడికి ఇదిముఖ్యం. దీనినే ‘దమము’ అని అంటారు.*
*ఎందుకంటే ప్రాపంచిక విషయములకు ఇంద్రియములు విపరీతంగా స్పందిస్తుంటే నిరంతరం వాటి ప్రభావానికి లోనవుతాడు కానీ అతడికి ఉన్నతస్థితి లభించే అవకాశమే లేదు.*
*ఇంద్రియములనే ఎందుకు నియంత్రించాలి ముందు మనసును నియంత్రించవచ్చు కదా. అంటే ముందు బయటకు కనపడే ఇంద్రియములను నియంత్రించ గలిగితే మనసును నియంత్రించడం సులభం అవుతుంది. అందుకే ముందు ఇంద్రియ నిగ్రహముతో మొదలు పెట్టాలి.*
*సాధారణంగా ఇళ్లకు తలుపులు పెట్టుకుంటాము. ఎందుకు.. ?అనవసరమైన వాళ్లు ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త. ఇంకా కొంత మంది అనుమతి లేనిదే లోపలకు రాకూడదు అని బోర్డుకూడా పెడతారు. మన ఇంటికే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము కదా. మన శరీరంలోకి ఇంద్రియముల ద్వారా ఎన్ని అనవసరవిషయాలు ప్రవేశిస్తాయో తెలుసుకోవద్దా! వాటిని నిరోధించడానికి తలుపులు పెట్టుకోవాలి కదా! లేకపోతే మన శరీరం ఒక పబ్లిక్ టాయిలెట్ అయిపోతుంది.*
*పబ్లిక్ టాయిలెట్ కు తలుపులు ఉండవు. ఎవరైనా వచ్చి పని కానిచ్చి పోవచ్చు. కాని వాళ్లు వదిలిన తాలూకు వాసనలు అక్కడే ఉంటాయి. అలాగే మన శరీరం తలుపులు తెరిచిపెడితే, బయట ప్రపంచంలో ఉన్న శబ్ద, స్పర్శ, రస, రూప,గంధములు అన్నీ యధేచ్ఛగా లోపలకు ప్రవేశిస్తాయి. వెళ్లిపోతాయి.* *కాని వాటి వాసనలు మాత్రం మనలను వదలవు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము అనే తలుపులు మనం అమర్చుకోవాలి.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి