27, జులై 2020, సోమవారం

పోతన తలపులో...(2)



ప‌ర‌మ శివుడిపై పోత‌న‌రాసిన ప‌ర‌మాద్భుత ప‌ద్యం
కైలాసం నుంచి శివ‌య్య‌ను మ‌న క‌ళ్ల‌ముందు నిలిపే ప‌ద్యం.
                              ****
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక మౌళికిఁగ పాలికి మన్మథ గర్వ పర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్.
                              ****

అనంత లీలాతాండవలోలు డైన పరమ శివునికి, మిక్కలి దయ గలవానికి, త్రిశూల ధారికి, పర్వతరాజ పుత్రి పార్వతీదేవి  ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వ‌మూ అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించే వానికి... శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను...... అని శివుడికి అక్షరార్చన చేశాడు పోతన.
ఈ పద్యంతో పరమశివుడిని  కైలాసం నుంచి మన కళ్లముందుకు తెచ్చినిలిపి తరింప చేసిన పోతనకు  తెలుగుజాతి ఎన్నటికీ రుణపడి ఉంటుంది.
🏵️పోత‌న ప‌ద్యాలు...కైవ‌ల్య ప‌థాలు 🏵

కామెంట్‌లు లేవు: