25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

**హిందూ ధర్మం* - 48

 **దశిక రాము**l

(విద్య - 2)


ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందుతున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ ఎంత సంపాదించినా, ఆనందంగా ఉండలేకపోతున్నారు, జీవితంలో ఒక అసంతృప్తి, ఏది తెలియని వెలితి. ఎందుకు? ఎంత గొప్ప చదువులు చదివినా తల్లిదండ్రులను వీధిన పడేస్తున్నారు, తన్ని తరిమేస్తున్నారు, జీతం తక్కువగా వస్తోంది, కలిసి ఉంటే మన జీతం కూడా మన అన్నకో, తమ్ముడికో ఇవ్వాల్సి వస్తుందని వేరు కాపురం పెడుతున్నారు ఎందుకు? సొంత చెల్లెలి పెళ్ళి భారంగా భావిస్తున్నారు ఎందుకు?


ఎందుకంటే ఈ రోజు మనం చదువుతున్న చదువులు సంస్కారాన్ని ఇవ్వడంలేదు. ప్రేమలు, అనుబంధాల గురించి చెప్పడంలేదు, నైతిక విలువల గురించి మనము, మన పిల్లలు చదువుకున్న చదువులో ఏమి ఉండదు. పిల్లలను కేవలం ఒక యంత్రాలుగా చూస్తూ, నిత్యం ఏదో ఒకటి నూరి పోయడమే విద్యా విధానం అయిపొయింది. అసలు ఇది విద్యనే కాదు, ఇది ఒక మిధ్య. ఆస్తికులుగా వెళ్ళిన పిల్లలను నాస్తికులుగా, భౌతికవాదులుగా మారిపోతున్నారు. ఆత్మనూన్యతకు లోనవుతున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు, కనీసం 8 గంటల సుఖనిద్ర కూడా లేని స్థితికి చేరుకున్నారు. ఇది భారతీయ విద్యావిధానం కాదు.


విద్య వినయాన్నిస్తుంది, అందరిని, అన్నిటిని అంగీకరించడం నేర్పిస్తుంది. ఆస్తికతను పెంచుతుంది, నైతికవిలువలను వృద్ధి చేస్తుంది. సమాజం పట్ల బాధ్యతలను, తోటి మనుష్యుల పట్ల ప్రేమానురాగాలను కలిగిస్తుంది. స్వార్ధాన్ని తొలగిస్తుంది, పదిమందికి సాయపడే మనస్తత్వాన్ని కలిగిస్తుంది. సహనాన్ని ఇస్తుంది, ఓర్పును పెంచుతుంది. అన్నిటికి మించి సంతృప్తినిస్తుంది. ఇది ఒక్క ఋషుల చేత ఏర్పరిచిన భారతీయ విద్యావిధానంలోనే కనిపిస్తుంది. ఈ రోజు సొంత చెల్లలికి పెళ్ళి చేయడం అన్నకు భారంగా మారింది. కానీ ఒకప్పడు భారతదేశంలో గృహస్థులు తమ కుటుంబీకులతో పాటు, బంధువుల బాగోగులను కూడా దగ్గరుండి చూసుకున్నారు. వారి నుంచి ఏమి ఆశించకుండా సాయం చేశారు. భారతీయ విద్యావిధానంలో చదువుకున్న ఏ విద్యార్ధి అడుక్కుతిన్న దాఖలాల్లేవు. ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు, దోచుకులేదు, మోసం చేయలేదు, తల్లిదండ్రులను ఇంట్లో నుండి వెళ్ళగొట్టలేదు, ముసలివారిని భారంగా భావించలేదు. ఇవన్నీ ఒక భారతీయ విద్య మాత్రమే అందించింది. విద్య అంటే భారతీయ విద్యనే. అటువంటి విలువలను పెంచే విద్యను అభ్యసించడం ధర్మం.


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

https://chat.whatsapp.com/HUn5S1ETDNTG580zg5F9PU


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95


*ధర్మము - సంస్కృతి* గ్రూప్

 ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: