మోక్షంఅంటే నిరాకారమైన మహా చైతన్య శక్తి ఒకటి ఉంది అది తెలిస్తేనే గాని, నిత్యమైననటువంటి స్వయంప్రకాశమైనటువంటి సర్వ వ్యాపకమైన నిరాకారమైన మహా చైతన్య శక్తి ఒకటి ఉంది, అని తెలిస్తేనే గాని ఆ అనుభూతి పొందితే గాని, మానవుడు పునర్జన్మ పొందకుండా మోక్షాన్ని లేదా ముక్తిని తెలుసుకుని పరమాత్మలో లీనంఅవలేడు. పరమాత్మ తానని తెలుసుకోవడమే. సాధన అద్వైత సిద్ధాంత చర్చిస్తున్నప్పుడు సాధన అయిపోతుంది. సాధన చేస్తూనే సిద్ధి పొందడం జరుగుతుంది.
ప్రత్యేకంగా అద్వైత వేదాంతం జపాలు పూజలు ఈ సాధనలేం ఉండవు. శంకరులు చెప్పారు కదా పూజలు స్తోత్రాలు కూడా రాశారు అంటే అధికారభేధం వలన, మానవులందరూ కూడ ఒకవిధమైన స్థాయిలో ఉండరు. ఉత్తమ అధికారులకు బ్రహ్మ సూత్రాలు, మధ్య మాధికారులకు ఉపనిషత్తులు, అధమాధికారులకు పూజలు స్తోత్రాలు, జపాలు, తపాలు చేసి కర్మకాండ ఆచరిస్తే అప్పుడు చిత్త శుద్ధి కలిగి నిర్మలమైన అంతఃకరణ తోటి సాకారాన్ని ధ్యానించి నిరాకార స్థితి పొందగలుగుతారు. అంతే తప్ప విగ్రహారాధన వల్ల మోక్షం రాదు. కర్మల వల్ల గానీ, భక్తి వల్లగాని, ఉపాసన వల్ల గానీ, యోగం వల్ల గానీ, ధ్యానం వల్ల గానీ, ఏ విధమైనటువంటి మోక్షము రాదు. ఫలితం వస్తుంది పుణ్యం వస్తుంది. "క్షీణే పుణ్యేమత్యలోకం వినశ్యంతి "అనేది వేదం
ఆ పుణ్యఫలం వల్ల మహారాజ వంశంలో పుడతాడు భోగాలు అనుభవిస్తాడు. పుణ్యం పూర్తవగానే మళ్ళీ జన్మ ఎత్తుతాడు.
జనన మరణ చక్రం నుండి తప్పించుకోలేడు. జ్ఞానంవల్లే మోక్షం సిద్ధిస్తుందని భగవద్గీత లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. సాధన చేసి జ్ఞానం వల్ల ఆత్మ జ్ఞానం పొందాలి. తానే పరమాత్మని గుర్తించడం గమ్యం
మనిషి స్తూలదేహం పోతుంది. కానీ నేను అనే దేహం పోతుంది. నేను అనే జ్ఞానం సూక్ష్మ శరీరంతో పాటు ఆ వాసనలు తీసుకుంటుంది. ఇక్కడ స్తూలశరీరంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు అనే ఏకాదశ ఇంద్రియం కల్సి ఉంటుంది
కోట్లాది జన్మజన్మల నుంచి వస్తున్నదే వాసనలు ఆ వాసనలు అన్నీ గట్టిపడి పోయి వృత్తులుగా ఏర్పడాతాయి. చనిపోయిన పోయిన తర్వాత సూక్ష్మ దేహం పొంది ఆ వాసనలతోటి కర్మలను అనుసరించి ఇంకో జన్మ ఎత్తడానికి మరో చొక్కా తొడుక్కోవడానికి మరో జన్మ ఎత్తుతుంది. ఆ వాసనలు కూడా పోతే లింగ శరీరం పొందుతుంది.దాన్నే కారణ శరీరం అన్నారు. కారణ శరీరంలో అహంకారం ఒక్కటే ఉంటుంది. అదీ కూడా పోయి విశ్వచైతన్యంలో కలిసిపోతుంది.అప్పుడు జీవాత్మ తన ఉనికిని కోల్పోయి పరమాత్మ అయిపోతుంది. అప్పుడు భిన్నత్వం అనేది ఉండదు అంతా ఏకత్వం అయిపోతుంది అదీ మోక్ష స్థితి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి