శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి.
ఏడవ రోజు అమ్మవారి అలంకారము.🌹🌹🌹🌹శ్రీ మహాలక్ష్మీ దేవి.🌹🌹
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్షలబ్ద విభవద్ర్భాహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలిక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ధి పుత్రిక. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
"యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా" అంతే అన్ని జీవులలోను ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. అమ్మవారికి వడపప్పు, చలివిడి నివేదన చేయాలి.
నైవేద్యం - వడపప్పు,క్షీరాన్నం.🙏🌹🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి