అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. అమ్మ సృష్టికి మూలం. దీనికి ఆవు పాలు శరణ్యం, ఆ అమ్మకు కూడా సృష్టి పరిణామం నకు నవ మాసములవరకూ ఆవు పాలు శరణ్యం. ఆతరువాత కూడా అమ్మకు తద్వారా మనకు కూడా ఆ ఆవు పాలు శరణ్యం. ఆపై వృధ్దికికూడా ఆవు పాలు శరణ్యం చనిపోయే ఆఖరి నిమిషంలో వరకూ కూడా ఆవు పాలు. వక వస్తువు మనిషి మనుగడకు యింత ప్రాముఖ్యతా!యిది యే హైందవ జీవన వేదం. ఇల్లు. జీవుల వృధ్దికికూడా స్థానం. దేహం ఆత్మ వృధ్దికి ఎలాగో జీవ వృధ్దికి యిల్లు కూడా అంతే. ఇల్లు జీవుల సమూహం. జీవులసమూహమే ఈశ్వర తత్వం. సమస్త జగత్తు యీశ్వర్యము తత్వమే. జగత్తు పరమేశ్వరుని యిల్లు. యిల్లు అనగా పరిమిత స్థానం మానవులకు. భగవంతునికి విశ్వం అంతా యిల్లు. జీవ ఆవిర్భావం యీశ్వర్యము చైతన్యం. అదే విష్ణు తత్వం కూడా. నమెూ రుద్రాయ విష్ణవే మృత్యుం మే పాహి. అని రుద్రం. విష్ణువు శివుడు కూడా వక చేయని వారే జగత్తు నకు మాతా పితరులు. ఏం చెప్పినా ఏ వేదం ఏ పురాణం ఏ సృతి స్మృతులు చెప్పినా అన్నింటికి వకే తత్వం జీవ లక్షణం. దానిని మార్పునకు కూడా మనమే కారణం అనగా జీవులే కారణం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి