🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *శివానందలహరీ – శ్లోకం – 32*
. శ్రీ ఆదిశంకరాచార్య విరచితం
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*జ్వాలోగ్రస్సకలామరాతి భయదః క్ష్వేళః కథంవా త్వయా*
*దృష్టః కించ కరే ధృతఃకరతలే కింపపక్వ జంభూఫలం ?*
*జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికావా కంఠదేశేభృతః*
*కిం తే నీలమణి ర్విభూషణ మయం శంభో ! మహాత్మన్వద !!*
*తాత్పర్యము:*
మహాత్మా ! శివా! తీవ్ర జ్వాలలు క్రమ్ముతూ, సకలదేవతలకునూ మిక్కిలి భయమును పుట్టించే, ఆ కాలకూట విషాన్ని కన్నులతో నీవు ఎలాౘూశావు ? అంతేగాక అరచేతిలో దాన్ని ఎలా ఉంౘుకున్నావు? అదేమైనా పండిన నేరేడు పండా ఏమిటి? అదీగాక దానిని నాలుక మీద వేసుకున్నావు. అది సిద్ధఘుటికయా ఏమిటి? మఱియూ కంఠమునందు నిలుపుకున్నావు. ఇది నీకు ఆభరణంగా వుండే ఇంద్రనీలమణియా?చెప్పు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి