🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 126*
🔴 *రాజనీతి సూత్రాణి - చతుర్ధాధ్యాయము* :
1. ధర్మేణ ధార్యతే లోకః
(లోకాన్ని ధర్మమే నిలబెడుతున్నది.)
2. ప్రేతమపి ధర్మాధర్మా వనుగచ్చతః
(చచ్చిన వానిని కూడా ధర్మాధర్మాలు వెంబడిస్తాయి.)
3. దయా ధర్మస్య జన్మభూమిః
(ధర్మానికి పుట్టినిల్లు దయ.)
4. ధర్మమూలే సత్యదానే
(సత్యమూ, దానమూ ధర్మానికి మూలం.)
5. ధర్మేణ జయతి లోకాన్
(ధర్మం చేత లోకాల్ని జయిస్తాడు.)
6. మృత్యురపి ధర్మిష్ఠం రక్షతి
(ధర్మాత్ముడ్ని మృతదేవత కూడా రక్షిస్తుంది.)
7. ధర్మాద్విపరీతం పాపం యత్ర ప్రసజ్యతే తత్ర తత్ర ధర్మావమతిరేవ మహతీ ప్రసజ్యతే
(ధర్మానికి విరుద్ధమైన పాపం ఎక్కడెక్కడ ప్రవర్తిస్తుందో అక్కడ ధర్మానికి పెద్ద అవమానం కలుగుతుంది. ధర్మం పేరిట దానికి విరుద్ధమైన పాపం ఎక్కడెక్కడ వ్యాపిస్తుందో అక్కడ ధర్మానికి అవమానమే జరుగుతుంది.)
8. ఉపస్థితవినాశానాం ప్రకృతిః ఆకారేణ చ లక్ష్యతే (వినాశం దగ్గరపడ్డ వాళ్ళ స్వభావం వాళ్ళ ఆకారం చేత, చేసే పనులచేత తెలుస్తుంది.)
9. ఆత్మవినాశం సూచయత్వధర్మబుద్ధిః
(అధర్మబుద్ధి ఆత్మవినాశాన్ని సూచిస్తుంది.)
10. పిశునవాదినో రహస్యం కుతః ?
(చాడీలు చెప్పేవాడికి రహస్యం ఏమిటి ?)
11. పరరహస్యం నైవ శ్రోతవ్యమ్
(ఇతరుల రహస్యాలు వినకూడదు.)
12. వల్లభస్వ స్వార్ధపరత్వమధర్మయుక్తమ్ (ప్రేమించబడేవాడు స్వార్ధపరుడై ఉండడం అధర్మం.)
13. స్వజనే ష్యతిక్రమో న కర్తవ్య
(తనవాళ్ళ విషయంలో కూడా మర్యాదను అతిక్రమించకూడదు.)
14. మతాపి దుష్టా త్వాజ్యా
(తల్లైనా దుష్టురాలైతే విడిచిపెట్టి వేయాలి.)
15. స్వహస్తో పి విషదిగ్ధశ్చేద్యాః
(విషం పూసిన తన చేతినైనా నరికి వెయ్యాలి.)
16. పరో పి చ హితో బంధు
(పరాయివాడైనా హితుడు బంధువే.)
17. కక్షాదప్యౌషదం గృహ్యతే
(పొదలోనుంచి అయినా ఔషధం గ్రహించబడుతుంది.)
18. నాస్తి చేరేషు విశ్వాస
(దొంగలమీద నమ్మకం పనికిరాదు.)
19. అప్రతీకారేష్యనాదరో న కర్తవ్య
(ప్రతిక్రియ చేయని వారి విషయంలో మనం చేసిన దానికి ఇతడు ఏమి ప్రతిక్రియ చేయలేదు కదా అని ఏమరిపాటుగా ఉండకూడదు. అతడు ఎప్పుడైనా చేయవచ్చు.)
20. వ్యసనం మానగపి బాధతే
(కొంచమైనా దుర్వ్యసనం బాధిస్తుంది.)
21. అమరవదర్ధజాతమర్జయేత్
(ధనం సంపాదించేటప్పుడు "నాకు మరణం" లేదు అన్నట్లు సంపాదించాలి.)
22. అర్ధవాన్ సర్వలోకస్య బహుమన్యతే లోకః (ధనవంతుణ్ణి అందరూ గౌరవిస్తారు.)
23. మహేంద్రమప్యర్ధహీనం న బహుమన్యతే లోకః (సాక్షాత్తు దేవేంద్రుడే అయినా ధనం లేనివాడ్ని లోకం గౌరవించదు.)
24. దారిద్య్రం ఖలు పురుషస్య సజీవితమ్ మరణమ్
(మానవుడికి దారిద్రం అనేది జీవించి ఉండగానే మరణం.)
25. విరూపో ప్యర్ధన్ సురూపః
(కురూపి అయినా ధనం ఉంటే సౌందర్యవంతుడు.)
26. అదాతారమప్యర్ధంతమర్ధినో త్యజంతి
(ఏమీ ఇవ్వనివాడైనా ధనికుడ్ని యాచకులు విడిచిపెట్టరు.)
27. అకులీనో పి ధనవాన్ కులీనాద్విశిష్ట (సత్కులంలో పుట్టినవాడు కాకపోయినా ధనవంతుడు కులీనుడే.)
28. నాస్త్యవమానభయమనార్యస్య
(నీచుడు అవమానానికి భయపడడు.)
29. నోద్యోగవతాం వృత్తిభయమ్
(పాటుపడేవాళ్ళకి వృత్తి దొరకదనే భయం లేదు.)
30. న జితేంద్రియాణాం మరణభయమ్ (ఇంద్రియాలను జయించిన వాళ్ళకి భోగ్యవిషయాల వల్ల భయం ఉండదు.)
31. న కృతార్ధానాం మరణభయమ్
(కర్తవ్యాలన్నీ చేసుకున్నవాళ్ళు మరణానికి భయపడరు.)
32. కస్యచిదర్థం స్వమివ మన్యతే సాధు
(అది ఎవరి సొత్తయినా తన సొత్తే అనుకొని సంతోషిస్తూ ఉంటాడు సత్పురుషుడు.)
33. పరివిభవేష్యదరో న కర్తవ్య
(పరుల ఐశ్వర్యాల మీద ఆసక్తి చూపకూడదు.)
34. పరివిభవేష్యాదరో పి నాశమూలమ్
(పరుల వైభవాల మీద ఆదరం చూపినా అది నాశనానికి దారి తీస్తుంది.)
35. పలాల మపి పరద్రవ్యం న హర్తవ్యమ్
(పరద్రవ్యం గింజలేని పొట్టు కూడా హరించకూడదు.)
36. పరద్రవ్యాపహరణమాత్మద్రవ్య నాశహేతుః (పరుల ద్రవ్యం హరించడం వల్ల తన ద్రవ్యం నశిస్తుంది.)
37. న చౌర్యాత్పరం మృత్యుపాశః
(దొంగతనాన్ని మించిన యమపాశం లేదు.)
38. యవాగూరపి ప్రాణధారణం కరోతి కాలే
(కొన్ని సమయాలలో గంజి కూడా ప్రాణాలను నిలబడుతుంది.)
39. న మృతస్యౌషదం ప్రయోజనమ్
(చచ్చినవానికి ఔషధం నిరుపయోగం.)
40. సమకాలే ప్రభుత్వస్య ప్రయోజనం భవతి
(కాలం సమంగా ఉన్నప్పుడే ప్రభుత్వం వల్ల ప్రయోజనం ఉంటుంది.)
41. నీచస్య విద్యాః పాపకర్మన్యేవ తం యోజయన్తి (నీచుడికి విద్యలు ఉన్నా అవి వానిచేత పాపకర్మలే చేయిస్తాయి.)
42. పయఃపానమపి విషవర్థనం భూజంగస్య త్వమృతం స్యాత్
(పాము పాలు తాగితే విషముగానే మారుతుంది. కాని అవి అమృతంగా మారవు.)
43. న హి ధ్యాన్యసమో హ్యర్థః
(ధ్యానం వంటి ధనం లేదు.)
44. న క్షుధాన్యసమో హ్యర్థః
(ఆకలి వంటి శత్రువు లేడు.)
45. అకృతేర్నియాతా క్షుత్
(పనిలేనివానికి ఎప్పుడూ ఆకలే.)
46. నాస్త్యభక్ష్యం క్షుదితస్య
(ఆకలిగొన్న వాడికి తినదగనిది అంటూ లేదు.)
47. ఇంద్రియాణి ప్రతిపదం నరాన్ జరాకృశాన్ కూర్వంతి
(ఇంద్రియాలు మనుష్యుల్ని అడుగడుగునా ముసలితనం చేత కృషించిపోయేటట్లు చేస్తాయి.)
48. సానుక్రోశం భర్తారమాజీవేత్
(జాలిగల ప్రభువును ఆశ్రయించి బ్రతకాలి.)
49. లుబ్ధసేవీ పావకేచ్చయా ఖద్యోతం ధమతి (లోభియైన ప్రభువును సేవించడం అంటే నిప్పు కోసం మిణుగుడు పురుగును పట్టుకొని ఊదినట్లే.)
50. విశేషజ్ఞం స్వామినమాశ్రయేత్
(ఇతరుల గుణాలను తెలుసుకొనగలిగిన ప్రభువును ఆశ్రయించాలి.)
51. పూరుషస్యమైథునం జరా
(పురుషుడికి మైథునం దౌర్భల్యహేతువు.)
52. స్త్రీణామమైథునం జరా
(స్త్రీలకు మైథునం లేకపోవడం ముసలితనం.)
53. న నీచోత్తమయోర్వైవాహః
(నీచులకీ ఉత్తములకీ మధ్య వివాహసంబంధం కుదరదు.)
54. అగమ్మాగమనాదాయుర్యశః పున్యాని క్షీయతే (అక్రమ స్త్రీతో సంబంధంవల్ల ఆయుర్ధాయము, కీర్తి, పుణ్యమూ కూడా నశిస్తాయి.)
55. నస్త్యహంకారసమః శత్రుః
(అహంకారం వంటి శత్రువు లేడు.)
56. సంసది శత్రుం న పరిక్రోశేత్
(శత్రువుని సభలో పదిమందిలో నిందించకూడదు.)
57. శత్రువ్యసం శ్రవణసుఖమ్
(శత్రువు కష్టాలలో ఉన్నాడంటే వినడానికి చాలా ఆనందకరం.)
58. అధనస్య బుద్ధిర్న విద్యతే
(ధనంలేనివారికి బుద్ధి పనిచెయ్యదు.)
59. హితమష్యధనస్య వాక్యం న గృహ్యతే
(ధనం లేనివానిమాట హితకరమే అయినా వినరు.)
60. అధనః స్వభార్యయా ప్యవమన్యతే
(ధనం లేనివాడ్ని భార్య కూడా అవమానిస్తుంది.)
61. పుష్పహీనం సహకారమపి నోపాసతే భ్రమరాః (తియ్య మామిడి చెట్టే అయినా పువ్వులు లేకపోతే తుమ్మెదలు దాని దరికి చేరవు.)
(ఇంకా ఉంది)...🙏
సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి