29, ఆగస్టు 2020, శనివారం

గురువు నుండి నేర్చుకునేది పావుభాగమే!

ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వమేథయా ।
 
గురువు నుండి నేర్చుకునేది పావుభాగమే!

ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్యః స్వమేథయా ।
పాదం సబ్రహ్మచారిభ్యః,
పాదం కాలక్రమేణ చ ॥

విద్యార్థి జ్ఞాన సముపార్జనా మార్గాలని లేదా విధానాలని గురించి తెలియ చెప్పే సుభాషితం.

ఆచార్యుడు లేదా గురువు లేదా teacher వద్ద నుండి విద్యార్థి నిజముగా నేర్చుకునేది ఒక నాలుగవ వంతు మాత్రమే. మరి ఒక నాలుగవంతు భాగం తన యొక్క స్వంత మేధా శక్తితోను, విషయ పరిజ్ఞానపరిశోధనతోను, తన యొక్క విశ్లేషణా శక్తితోనూ నేర్చుకుంటాడు. మరి మూడవ భాగమైన నాలుగవ వంతు భాగాన్ని సహబ్రహ్మచారులతోనూ అనగా తోటి విద్యార్థులతోడి చర్చలద్వారా, discussions ద్వారానూ, interactions ద్వారానూ నేర్చుకుంటాడు. తన యొక్క సంపూర్ణ విద్యాసముపార్జన, జ్ఞాన సముపార్జనలని చివరి నాలుగవ భాగాన్ని, కాలక్రమేణా తన జీవితానుభవముల ద్వారా, తన జిజ్ఞాసతో కూడిన నిరంతర గ్రంథ పఠనాల ద్వారా నేర్చుకుని పరిపక్వత సాధిస్తాడు.

అనగా, సమగ్రమైన విద్యాభ్యాసం విద్యాలయాలతో పరిసమాప్తి కాదు. అది జీవితాంతమూ జరిగే నిరంతర ప్రక్రియ అని తాత్పర్యం.
పాదం సబ్రహ్మచారిభ్యః, పాదం కాలక్రమేణ చ ॥

*****************

కామెంట్‌లు లేవు: