మహా సంకల్పం లో ఈ పేర్లు వస్తాయి.. చూడండి
భారత వర్షం, ఇంద్రద్వీపం, కసేరు, తామ్రపర్ణి, గభస్తిమంతం, నాగద్వీపం, సౌమ్యం, గంధర్వం, వారుణం అని తొమ్మిది భాగాలుగా ఉంది. దీని తూర్పున కిరాతులు, పడమటి వైపు యవనులూ ఉన్నారు. దీని పుణ్యనదుల ఒడ్డున పాఞ్చాల, మధ్యదేశ, పూర్వదేశ, కామరూప, పుండ్ర, కళింగ, మగధ, దాక్షిణాత్య, అపరాంత, సౌరాష్ట్ర, శూర, ఆభీర, అర్బుదగణ, కారూప, మాళవ, పారియాత్ర, సౌవీర, సైంధవ, హూణ, కోవల, మద్ర, అరామ, అంబష్ఠ, పారశీక దేశవాసులు నివసిస్తున్నారు. ఈ భారత దేశంలో సత్యా, త్రేతా, ద్వాపర, కలియుగాలని నాలుగు యుగాలు ఉన్నాయి. ఇవి మరెక్కడా లేవు. వెయ్యి జన్మలెత్తాక ఎంతో పుణ్యము చేసుకున్నందువలన ఈ దేశంలో మనిషి జన్మ లభిస్తుంది.
శ్రీ విష్ణుపురాణంలో - భారత వర్షంలో పుట్టిన మనుషులు దేవతల కంటే కూడా భాగ్యవంతులని చెప్పబడింది. అందుకే ఇక్కడ పుట్టిన భారతీయుల ఖ్యాతి గురించి దేవతలు కూడా గానం చేస్తూ ఉంటారు.
అతః పరం ప్లక్షాదీనాం ప్రమాణలక్షణసంస్థానతో వర్షవిభాగ ఉపవర్ణ్యతే
జమ్బూద్వీపోऽయం యావత్ప్రమాణవిస్తారస్తావతా
క్షారోదధినా పరివేష్టితో యథా మేరుర్జమ్బ్వాఖ్యేన
లవణోదధిరపి తతో ద్విగుణవిశాలేన ప్లక్షాఖ్యేన పరిక్షిప్తో
యథా పరిఖా బాహ్యోపవనేన ప్లక్షో జమ్బూ
ప్రమాణో ద్వీపాఖ్యాకరో హిరణ్మయ ఉత్థితో యత్రాగ్నిరుపాస్తే
సప్తజిహ్వస్తస్యాధిపతిః ప్రియవ్రతాత్మజ
ఇధ్మజిహ్వః స్వం ద్వీపం సప్తవర్షాణి విభజ్య సప్తవర్షనామభ్య
ఆత్మజేభ్య ఆకలయ్య స్వయమాత్మ యోగేనోపరరామ
జంబూ ద్వీపం ఎంత పొడవూ వెడల్పూ వైశాల్యమూ ఉన్నదో అంత కొలతా ఉన్న ఉప్పు సముద్రం జంబూ ద్వీపం చుట్టూ ఉంది. మేరు పర్వతం జంబూ ద్వీపముతో ఆవరించబడి ఉనట్లుగా ఉప్పు సముద్రం కూడా దాని కంటే రెండు రెట్లు వైశాల్యం ఉన్న ప్లక్ష ద్వీపముతో ఆవరించబడి ఉన్నది. జంబూ ద్వీపమూ దాని చుట్టూ లవణ సముద్రం, దాని చుట్టూ ప్లక్షం. ద్వీపమూ - సముద్రమూ - ద్వీపము. ద్వీపానికి సముద్రము హద్దు, సముద్రానికి ద్వీపం హద్దు. ప్లక్ష ద్వీపములో ఏడు నాలికలు గల అగ్ని ఆరాధించబడతాడు. జంబూద్వీపంలో ఎంత పెద్ద నేరేడు చెట్టు ఉందో అంతా పెద్ద ప్లక్ష వృక్షము (జువ్వి చెట్టు) ప్లక్ష ద్వీపములో ఉంది. బంగారపు చెట్టు అది. ఆ ప్లక్ష వృక్షం వలననే ఆద్వీపానికి ప్లక్ష ద్వీపం అని పేరు వచ్చింది. ప్రియవ్రతుని కుమారుడైన ఇద్మజిహ్వుడు ఈ ద్వీపానికి అధిపతిగా ఉండేవాడు. ప్లక్ష ద్వీపాన్ని ఏడూ వర్షాలుగా విభజించి, ఏడు కుమారుల పేర్లు వాటికి పెట్టి, వారికి అవి పంచి; పరమాత్మను ఆరాధించడానికి వెళ్ళిపోయాడు ఇద్మజిహ్వుడు.
శివం, యవనం, సుభుద్ర, శాంతం, క్షేమం, అమృతం, అభయం - ఈ ఏడు ప్లక్ష ద్వీపములోని వర్షాల పేర్లు. వీటిలో మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంత్రం, సువర్ణం, హిరణ్యష్ఠీవం, మేఘమాల అని ఏడు మహా పర్వతాలూ, అరుణ, నృమ్ణ, ఆంగీరసి, సావిత్రి, సప్రభాత, రుతుభర, నత్యంబర అని ఏడు నదులు ఉన్నాయి. ఈ నదుల జలమును స్పృశిస్తే అన్ని పాపాలూ తొలగిపోతాయి. ఈ ద్వీపములో నాలుగు జాతులున్నాయి. హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగ అనే వర్ణాలున్నాయి.
ఇలా ఈ పంచమ స్కంధం లో చాల మంచి విలువైన సమాచారం ఉంటుంది..
ఇట్లు
శివ పరివారం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి