12, అక్టోబర్ 2022, బుధవారం

చంద్రోదయఉమావ్రతం

 💐💐అమ్మాయిలు తమ కలలు పండాలని.. అనుకూలవంతుడైన..,,

జీవిత బాగస్వామి భర్త గా లభించాలని..

.ఆచరించే ఈ అట్లతదియ వ్రతానికి అసలు పేరు "చంద్రోదయఉమావ్రతం" 


**అశ్వయిజ బహుళ తదియ నాడు చంద్రుడు ఉదయించిన పిదప ఉద్యాపన చేసి తమ ఉపవాసాలకు, స్వస్తి పలికి "అట్ల" ను ముత్తయిదువలకు వాయనం  గా "తదియ" నాడు ఇస్తారు కనుక ఈ నోమును "అట్ల తద్దె"ని అనటం వాడుకలో వచ్చింది.


.. ** కొన్ని ప్రాంతాలలో అట్ల తదియ నాడే 'ఉండ్రాళ్ళు తదియ' వ్రతం కూడా ఆచరిస్తారు.

."బృహత్ ఉమా వ్రతం " గా చెప్పబడు ఉండ్రాళ్ళతద్దె /ఉండ్రాళ్ళ తదియ ను వాస్తవానికి భాద్రపద బహుళ తదియ నాడు ఆచరించి పేరంటాళ్లకు ఉండ్రాళ్ళు వాయనం గా ఇచ్చేవాళ్ళు..


** ఇప్పుడేమో ఉండ్రాళ్ళతదియా,అట్ల తదియా వ్రతాలను కలిపి ఆచరిస్తున్నారు..


** పూర్వము పెళ్లి కానీ పిల్లలు ఆచరించే ఈ వ్రతాన్ని..నేడు మంచి భర్త లభించినందు కు / భర్త తో అన్యోన్య జీవితం ఇవ్వమని..గౌరీ దేవతను ప్రార్థించే పూజ గా ఈ వ్రతాన్ని చెప్పవచ్చు..


** ఈ వ్రతాన్ని తొలుత పార్వతీ దేవి ఆచరించి శివుని తన భర్త గా పొందినదని..చెప్పుట ఈ వ్రత ప్రాధాన్యాన్ని సూచిస్తుంది..


అట్లతదియ రోజున అనుకూల దాంపత్య సిద్ధికి అర్ధనారీశ్వర స్తోత్రంతో ఆరాధన చేయడం మంచిదని పెద్దల అభిప్రాయం....


"అర్థనారీశ్వర స్తోత్రము"


చాంపేయ గౌరార్థ శరీరకాయై

కర్పూర గౌరార్థ శరీరకాయ

ధమిల్ల కాయైచ జటాధరాయ

నమశ్శివాయై చ నమశ్శివాయII


కస్తూరికా కుంకుమ చర్చితాయై

చితారజః పుంజ విచర్చితాయ

కృత స్మరాయై వికృత స్మరాయ

నమశ్శివాయై చ నమశ్శివాయII


ఝణత్క్వణత్కంకణ నూపురాయై

పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ

హేమాంగదాయై భుజగాంగదాయ

నమశ్శివాయై చ నమశ్శివాయII


విశాల నీలోత్పల లోచనాయై

వికాసి పంకేరుహ లోచనాయ

సమేక్షణాయై విషమేక్షణాయ

నమశ్శివాయై చ నమశ్శివాయII


మందార మాలా కవితాలకాయై

కపాల మాలాంకిత కంథరాయ

దివ్యాంబరాయై చ దిగంబరాయై

నమశ్శివాయై చ నమశ్శివాయII


అంభోధర శ్యామల కుంతలాయై

తటిత్రభా తామ్ర జటధరాయ

నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ

నమశ్శివాయై చ నమశ్శివాయII


ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై

సమస్త సంహారక తాండవాయ

జగజ్జనన్యై జగదేక పిత్రే

నమశ్శివాయై చ నమశ్శివాయII


ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై

స్ఫురన్మహా పన్నగ భూషణాయ

శివాన్వితాయై చ శివాన్వితాయ

నమశ్శివాయై చ నమశ్శివాయII


ఏతత్పఠే దష్టక నిష్టదం యో

భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ

ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం

భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః


ఇతి శ్రీ శంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్ 🙏


ఊయలలు....ఊపిన చేతులు...ఉర్వి ని

 పాలించగలవని... నిరూపిస్తున్న మహిళా మణులకు వినమ్రపూర్వక నమస్కారాలు/ శుభాశీస్సుల తో...

సుశర్మ...

కామెంట్‌లు లేవు: